తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన ఆర్టీసీ కార్మికులను రోడ్డెక్కేలా చేయడం సమంజసం కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. సమ్మె నోటీసులిచ్చినా... స్పందించకపోవడం వల్లే ఈ ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్మికులెవరూ తొందరపడి అఘాయిత్యాలకు పాల్పడవద్దని విన్నవించారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక సంఘాల నాయకులతో నేరుగా చర్చించాలని కోరారు.
కార్మికులారా.... తొందర పడకండి: జగ్గారెడ్డి - congress party support to tsrtc strike
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కార్మికులెవరూ తొందరపడి ఆత్మహత్యకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు.