ETV Bharat / city

హైదరాబాద్‌కు 'అక్రమంగా' ఇసుక రవాణా.. వయా వత్సవాయి.! - ఇసుక మాఫియా

Sand From AP To Hyderabad: ఏపీ నుంచి ఇసుక లోడుతో ఉన్న లారీలు హైదరాబాద్​కు భారీగా తరలివస్తున్నాయి. తెలంగాణ-ఆంధ్ర సరిహద్దులోని గరికపాడు తనిఖీ కేంద్రం దాటితే వాటిని అడ్డుకునేవారే ఉండటం లేదు. దీంతో జాతీయ రహదారి పక్కనున్న మండలమైన వత్సవాయిలోని గ్రామాలకు ఇసుక సరఫరా చేస్తున్నామని వే బిల్లుల్లో చూపించి.. అటు నుంచి హైదరాబాద్‌ తరలిస్తున్నారు.

Sand
Sand
author img

By

Published : Jul 25, 2022, 10:28 AM IST

Sand From AP To Hyderabad : ఆంధ్రప్రదేశ్​ నుంచి ఇసుక అక్రమ రవాణాకు అధికారులు గేట్లెత్తినట్లే కనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఇసుకకు డిమాండు పెరగడంతో రోజూ హైవే మీదుగా వందల లారీలు తరలి వెళ్తున్నాయి. తెలంగాణ-ఆంధ్ర సరిహద్దులోని గరికపాడు తనిఖీ కేంద్రం దాటితే వాటిని అడ్డుకునేవారే ఉండటం లేదు. దీంతో జాతీయ రహదారి పక్కనున్న మండలమైన వత్సవాయిలోని గ్రామాలకు ఇసుక సరఫరా చేస్తున్నామని వే బిల్లుల్లో చూపించి.. అటు నుంచి అటే హైదరాబాద్‌ తరలిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఒకే గుత్త సంస్థ ఇసుక తవ్వకాలు చేపట్టిన విషయం తెలిసిందే. సంస్థ జారీ చేసే వే బిల్లుల్లో లెక్కాపత్రం లేకుండా పోతోంది. గతంలో గనులశాఖ ఇచ్చిన వే బిల్లులపై అధికారుల సంతకాలు, స్టాంపులు ఉండేవి. ప్రస్తుతం అవేవీ లేవు. జేపీ సంస్థ చేతిరాతతో జారీ చేస్తోంది. దీంతో చందర్లపాడు మండలంలోని రీచ్‌ నుంచి ఎక్కువగా వత్సవాయి మండల గ్రామాలకు వేబిల్లులు జారీ అవుతున్నాయి.

చందర్లపాడు మండలం కొడవటికల్లు నుంచి రోజుకు ఉదయం 50 లారీలు, కాసరాబాద్‌ నుంచి రోజుకు కనీసం 200 లారీలు హైదరాబాద్‌కు తరలిపోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో హైదరాబాద్‌లో 20 టన్నుల ఇసుక రూ.లక్ష వరకు పలుకుతోంది. దీంతో ఆయా కేంద్రాల్లో బల్క్‌ పేరుతో గుత్తేదారులు అక్రమ రవాణాకు ఊతమిస్తున్నారు.

.

స్పందించని అధికారులు.. ఇటీవల ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం నుంచి తెలంగాణ లారీలు తెల్లవారుజామునే ఇసుక లోడుతో బయలుదేరాయి. కొంతమంది అనుమానంతో నిలిపివేయగా.. వే బిల్లులు ఉన్నాయంటూ లారీ డ్రైవర్లు వాదించారు. వే బిల్లుల ప్రకారం లారీలు వత్సవాయి వెళ్లాలి. కానీ, జాతీయ రహదారి మీదుగా తనిఖీ కేంద్రం దాటి తెలంగాణలోకి ప్రవేశించాయి. ఈ ఘటనలో అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని లారీలు ఆపిన వ్యక్తులు తెలిపారు.

* చందర్లపాడు మండలం నుంచి నకిలీ రసీదులతో ఇసుక రవాణా చేస్తున్న లారీల ఆపిన స్థానికులు ఆ సమాచారాన్ని నందిగామ గనులశాఖ ఏడీకి ఇచ్చినా స్పందించలేదు.

* సరిగ్గా 3 నెలల కిందట ఓ ప్రైవేటు ఉద్యోగి ఇచ్చిన సమాచారం మేరకు గరికపాడు తనిఖీ కేంద్రం వద్ద అధికారులు 7 లారీలను ఆపారు. వేబిల్లుల్లో రాసిన మేరకు అవి వత్సవాయి, జగ్గయ్యపేట మండలాలకు వెళ్లాలి. కానీ, తెలంగాణలోకి వెళ్లేందుకు ప్రయత్నించి దొరికిపోయాయి. ఈ ఘటనలో లారీల సమాచారం ఇచ్చిన వ్యక్తి ఉద్యోగమే పోయిందంటే ఇసుక అక్రమ రవాణాపై రాజకీయ పెద్దల జోక్యం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.

సరకుతో వచ్చి.. ఇసుకతో వెళ్తూ..

సరకుతో వచ్చి.. ఇసుకతో వెళ్తూ.. తెలంగాణ నుంచి సరకు రవాణా పేరుతో రాష్ట్రానికి వచ్చిన లారీలు తిరుగు ప్రయాణంలో ఇసుక నింపుకొని వెళుతున్నాయి. దీనికి ఇబ్రహీంపట్నం దగ్గర ఒక బ్రోకర్‌ కార్యాలయం ఉంది. వారి ద్వారా లారీలకు ఇసుక కేటాయింపు జరుగుతోందని తెలిసింది. ఈ మేరకు లారీ యజమానులూ సిండికేటై వంతుల వారీగా లోడ్‌తో వెళ్తున్నారు. నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని నిలువ కేంద్రాలు, ఇసుక రేవుల నుంచీ అక్రమ రవాణా అవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.