విజయవాడ ఇంద్రకీలాద్రిపై జులై 3 నుంచి శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 గంటలకు ఉత్సవాలు మొదలవుతాయని దుర్గ గుడి ఈవో తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా.. తొలి రెండు రోజులు అంతరాలయంలోనే అమ్మవారిని అలంకరిస్తామని నిర్వహిస్తామని.. భక్తులు ఆన్‌లైన్ స్లాట్ మేరకు టికెట్లు బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
మూడో రోజు మహా మండపం, ఇతర ప్రాంగణాల అలంకరణ ఉంటుందని ఈవో తెలిపారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో భక్తులకు కదంబ ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారు. జులై 5న ఉదయం పూర్ణాహుతితో వేడుకలు ముగుస్తాయని అన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులంతా కరోనా నిబంధనలు తప్పక పాటించాలని స్పష్టం చేశారు. ఆలయ అర్చకులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.