ETV Bharat / city

ఏపీలో నేడు, రేపు వైకాపా జనాగ్రహ దీక్షలు - సజ్జల కామెంట్స్

sajjala-ramakrishna-reddy-on-pattabhi-comments-against-cm-jagan

author img

By

Published : Oct 21, 2021, 5:55 AM IST

05:50 October 21

ఏపీలో నేడు, రేపు వైకాపా జనాగ్రహ దీక్షలు

సజ్జల

తెదేపా నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఏపీలో.. వైకాపా ఆధ్వర్యంలో నేడు, రేపు రెండు రోజులపాటు జనాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala comments on tdp leaders news) ప్రకటించారు. ఈ దీక్షలపై బుధవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్​ నిర్వహించారు. రాజకీయాల్లో దిగజారుడు విధానాలకు వ్యతిరేకంగా, ప్రతిపక్ష పార్టీ.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి బూతులు మాట్లాడటాన్ని నిరసిస్తూ జనాగ్రహ దీక్షలకు వైకాపా పిలుపునిచ్చింది. 

అలా మాట్లాడించింది చంద్రబాబే..

తెదేపా నేతలు పరుష పదజాలం వాడుతున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala comments on tdp leaders news) అన్నారు. ఈ మేరకు పట్టాభి చేసిన వ్యాఖ్యలను సజ్జల ప్రదర్శించారు. సీఎం జగన్​పై పట్టాభి వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తెదేపా నేతలతో అలా మాట్లాడించింది చంద్రబాబేనని ఆరోపించారు. అలాంటి వ్యాఖ్యలతో రియాక్షన్ వస్తుందని వారికి తెలుసని వ్యాఖ్యానించారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ తమ పార్టీ నాయకులు సంయమనం పాటిస్తున్నారని వ్యాఖ్యానించారు.  

'కావాలనే మీడియా సమావేశంలో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి పరుష పదజాలం ఉపయోగించారు. ఉత్తర భారతదేశంలో అది ఓ బూతు మాట.. అనకూడని మాట. దీని వెనుక కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. గత 6 నెలలుగా నిస్పృహతో  తెదేపా నేతలు మాట్లాడుతున్నారు. వైఎస్‌ జగన్‌కు ఉన్న ప్రజాభిమానాన్ని చూసి తట్టుకోలేక తెదేపా నేతలు ఇలా మాట్లాడుతున్నారు’ -సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు

పార్టీ అధినేతను తిడితే అభిమానులు స్పందించడం సహజంమని సజ్జల వ్యాఖ్యానించారు. మంగళవారం ఘటనపై ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.