SADDULA BATHUKAMMA CELEBRATIONS: సద్దుల బతుకమ్మ వేడుకలను హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ చుట్టూ చేరి మహిళలంతా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. మా తల్లి బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఆహ్లాదకరంగా గడిపారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులు ఎంతో ఉల్లాసంగా ఆడిపాడారు. సద్దుల బతుకమ్మ వేడుకల వేళ మహా నగరంలోని రోడ్లన్నీ పూలవనంలా మారిపోయాయి.
నగరంలోని అన్ని ప్రాంతాలు బతుకమ్మ సంబురాల్లో మునిగిపోయాయి. హైదరాబాద్లోని శారదానగర్ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం, వెల్ఫేర్ అసోసియేషన్, కళాభారతి సాంస్కృత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు వైభవంగా సాగాయి. చిన్నా పెద్దా అనే తేడాలేకుండా సుమారు 300 మంది వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలను నృత్యాలు చేస్తూ సంతోషంగా గడిపారు. అనంతరం పోయి రా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా అంటూ నిమజ్జనం చేశారు.
ఇవీ చదవండి: