ETV Bharat / city

తెలంగాణలో కదిలిన ఆర్టీసీ చక్రం - తెలంగాణలో కదిలిన ఆర్టీసీ చక్రం

ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్‌ సడలింపుల మేరకు రాష్ట్రంలో ప్రజారవాణా ప్రారంభమైంది. కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహా మిగతా ప్రాంతాలన్ని గ్రీన్‌జోన్లుగా పరిగణిస్తూ.. రాష్ట్రంలో ప్రజారవాణాకు అనుమతిచ్చింది.

rtc
తెలంగాణలో కదిలిన ఆర్టీసీ చక్రం
author img

By

Published : May 19, 2020, 9:33 AM IST

Updated : May 19, 2020, 1:00 PM IST

హైదరాబాద్‌ మినహా తెలంగాణ వ్యాప్తంగా ఎట్టకేలకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఉదయం 6 గంటల నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి బస్సులు నడపవచ్చని సీఎం కేసీఆర్‌ ప్రకటనతో ఆర్టీసీ చర్యలు చేపట్టింది.

జాగ్రత్తలు తీసుకుంటూ..

కరోనా వైరస్‌ నివారణకు శానిటైజేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తూనే ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నిబంధన విధించారు. మాస్కులు ఉన్నవారినే బస్సులోకి అనుమతిస్తున్నారు. కరీంనగర్‌ వైపు నుంచి రాజధాని నగరానికి వచ్చే బస్సులు జేబీఎస్‌ వరకే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

రాత్రి ఏడు గంటల వరకే..

నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే బస్సులను హయత్‌నగర్‌ వరకు, మహబూబ్‌నగర్‌ వైపు నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్‌ వరకు, వరంగల్‌ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్‌ చౌరస్తా వరకు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ డిపోల బస్సులు పహాడీ షరీఫ్‌ వరకు‌ అనుమతించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. బస్సు సర్వీసులు రాత్రి ఏడు గంటలకే నిలిపివేస్తారు. ఒకవేళ అప్పటికే టిక్కెట్లు జారీ చేస్తే ఎనిమిది గంటల వరకు అనుమతి ఉంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నారు.

ఇవీ చూడండి: 'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'

Last Updated : May 19, 2020, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.