ఇకపై ఆర్టీసీ సేవలు రోడ్డుతో పాటు ఆకాశమార్గంలోనూ అందించనున్నాయి. ఎయిర్ కార్గో సేవలకు సంబంధించి జీఎంఆర్‌తో ఆర్టీసీ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో... ఆర్టీసీ సీఎండీ సునీల్ శర్మ, జీఎంఆర్ సీఈఓ సౌరవ్ ఎంఓయూ చేసుకున్నారు.
పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వివిధ రకాల కూరగాయలు, దానిమ్మ, సీతాఫలం, ఆపిల్ వంటి పండ్లను, ఆటో మొబైల్ విడి పరికరాలను విదేశాలకు ఎయిర్ కార్గో ద్వారా సరఫరా చేయనున్నారు. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వాటిని తిరిగి ఆయా ప్రాంతాలకు సరఫరా చేస్తారు.
ఇదీ చూడండి: వ్యర్థాల నుంచి సంపద సృష్టిలో హైదరాబాద్ ఆదర్శం: కేటీఆర్