ETV Bharat / city

'తెలంగాణ ఏబీవీపీ కార్యకర్తల కష్టానికి స్ఫూర్తి ఛాత్రశక్తి భవన్‌ ప్రతీక' - ఏబీవీపీ రాష్ట్ర కార్యాలయం

RSS Chief Mohan Bhagwat: హైదరాబాద్‌ తార్నాకలోని ఏబీవీపీ రాష్ట్ర కార్యాలయం స్ఫూర్తి ఛాత్రశక్తి భవన్‌ను ఆర్ఎస్‌ఎస్‌ సర్‌ సంచాలక్‌ మోహన్‌ భగవత్‌ ప్రారంభించారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

RSS Chief Mohan Bhagwat inaugurated ABVP state office

author img

By

Published : Jun 17, 2022, 3:33 AM IST

RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు విద్యార్థి పరిషత్‌ కార్యకర్త అంటే సరస్వతిని పూజిస్తాడనే వారని.. కానీ ఇప్పుడు ఆ కార్యకర్త అంటే అఖండ దేశమనే మార్పు వచ్చిందని ఆర్ఎస్‌ఎస్‌ సర్‌ సంచాలక్‌ మోహన్‌ భగవత్‌ అభివర్ణించారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన తార్నాకలోని ఏబీవీపీ రాష్ట్ర కార్యాలయం స్ఫూర్తి ఛాత్రశక్తి భవన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ.. రాముని స్ఫూర్తి, సీత శ్రద్ధ ప్రతి కార్యకర్తలో ఉందన్నారు. ఇతిహాస కథతో ఏబీవీపీ కార్యకర్తల్లో స్ఫూర్తి నింపారు.

"తెలంగాణ ఏబీవీపీ కార్యకర్తల కష్టానికి ఈ భవనం ప్రతీకగా నిలుస్తుంది. ఏబీవీపీ కార్యకర్తకు గొప్ప గౌరవం లభిస్తుంది. కార్యకర్తల స్వప్నం నిష్టతో ఈ భవనం సాధ్యమైంద రాముడు 8వేల సంవత్సరాల తర్వాత పూజలందుకుంటున్నాడు. ఏబీవీపీ పూర్వ విద్యార్థులతో సమావేశం నిర్వహించి నిధి అభియాన్ ఏర్పాటు చేశారు. నూతన సాంకేతికతతో భవనాన్ని నిర్మించారు." -మోహన్ భగవత్‌, ఆర్‌ఎస్ఎస్ చీఫ్‌

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.