ETV Bharat / city

రోడ్డు భద్రతా చర్యలపై సుప్రీంకోర్టు కమిటీ సంతృప్తి

author img

By

Published : Dec 3, 2020, 7:48 PM IST

Updated : Dec 3, 2020, 9:35 PM IST

రాష్ట్రంలో రహదారి ప్రమాదాల కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు కమిటీ.. రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించింది. రాష్ట్రంలో రోడ్డు భద్రతకు తీసుకుంటున్న చర్యలను సీఎస్ సోమేశ్​ కుమార్ వివరించగా... సుప్రీం కోర్టు కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది.

road safety meeting with supreme court committee

రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల పట్ల సుప్రీంకోర్టు కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఆధ్వర్యంలోని బృందం.. రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించింది. ఈ సమావేశంలో సీఎస్​ సోమేశ్​ కుమార్ సహా... ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ జితేందర్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా సహా పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో రోడ్డు భద్రతకు తీసుకుంటున్న చర్యలను సుప్రీం కోర్టు కమిటీకి సీఎస్ సోమేశ్​ కుమార్ వివరించారు. ఈ నెల 11న సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. రోడ్డు భద్రతపై రాష్ట్రం తీసుకుంటున్న చర్యల పట్ల సుప్రీంకోర్టు కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి: ఏర్పాట్లు పూర్తి.. మొదటి ఫలితం వెలువడేది అక్కడే!

Last Updated : Dec 3, 2020, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.