ETV Bharat / city

Rice Export: విదేశాలకు బియ్యం ఎగుమతుల్లో 36% తెలుగు రాష్ట్రాల నుంచే..! - Rice Export FROM INDIA

విదేశాలకు బియ్యం ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయి. గతేడాది భారతదేశం నుంచి మొత్తం కోటీ 30 లక్షల టన్నుల సాధారణ బియ్యం ఎగుమతి కాగా అందులో తెలుగు రాష్ట్రాల నుంచే 36.16 శాతం (47.45 లక్షల టన్నులు) ఉన్నాయి. గత నాలుగేళ్లుగా బియ్యం ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉండగా.. తెలంగాణ గతేడాది పదో స్థానానికి చేరింది.

Rice Export
Rice Export: విదేశాలకు బియ్యం ఎగుమతుల్లో 36% తెలుగు రాష్ట్రాల నుంచే..!
author img

By

Published : Aug 17, 2021, 8:51 AM IST

తెలుగు రైతులు పండించిన బియ్యం విదేశాలకు భారీగా వెళుతున్నాయి. గతేడాది భారతదేశం నుంచి మొత్తం కోటీ 30 లక్షల టన్నుల సాధారణ బియ్యం ఎగుమతి కాగా అందులో తెలుగు రాష్ట్రాల నుంచే 36.16 శాతం (47.45 లక్షల టన్నులు) ఉన్నాయి. గత నాలుగేళ్లుగా బియ్యం ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉండగా.. తెలంగాణ గతేడాది పదో స్థానానికి చేరింది. వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల మొత్తం ఎగుమతుల్లో సాధారణ, బాస్మతీ బియ్యం కలిపి 65 శాతం వరకూ ఉన్నాయి. గతేడాది బియ్యం దిగుబడులు 12 కోట్ల టన్నులకు పైగా రాగా ఎగుమతులు 1.30 కోట్ల టన్నులు దాటడం విశేషం. తెలంగాణ నుంచి వీటి ఎగుమతులు 2019-20తో పోలిస్తే 2020-21లో దాదాపు 97 శాతం అదనంగా పెరిగి రూ.244.67 కోట్ల ఆదాయం వచ్చిందని ‘భారత వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి మండలి’ (అపెడా) నివేదిక వెల్లడించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బియ్యం ధరలు పడిపోయినా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు అమ్మే చిల్లర ధరలు తగ్గించడం లేదు. 2020 ఏప్రిల్‌, మే నెలల్లో భారత్‌ నుంచి 11.16 లక్షల టన్నుల సాధారణ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయగా రూ.3,448 కోట్ల ఆదాయం వచ్చింది. టన్నుకు సగటున రూ.30,957 ధర లభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో 28.96 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులపై రూ.7780 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే టన్ను సగటు ధర రూ.26,856 అని అపెడా వెల్లడించింది. వేరుసెనగ మాత్రం టన్ను ధర 1205 డాలర్ల నుంచి 1281 డాలర్లకు పెరిగింది. దీనికి అనుగుణంగా మన చిల్లర మార్కెట్లలో నూనె, పల్లీలు పెరిగాయి. హోల్‌సేల్‌ మార్కెట్లో తగ్గనందున తాము బియ్యం ధరలు తగ్గించలేదని హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నరేష్‌ ‘ఈనాడు’కు చెప్పారు.

వివరాలు

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.