ETV Bharat / city

స్వార్థ రాజకీయాల కోసమే విమోచన దినోత్సవాలు: రేవంత్​రెడ్డి

Revanthreddy on Telangana Liberation Day: దేశం, రాష్ట్రానికి స్వాతంత్య్రం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ కొందరు చరిత్రను వక్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సర్ధార్‌ వల్లాభాయి కారణంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని రేవంత్ అన్నారు. స్వాతంత్య్ర, సాయుధ పోరాట సమయానికి భాజపా అసలు పుట్టలేదని పేర్కొన్నారు.

Revanthreddy
Revanthreddy
author img

By

Published : Sep 17, 2022, 1:57 PM IST

స్వార్థ రాజకీయాల కోసమే విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నారు: రేవంత్​రెడ్డి

రాజకీయ కోణంలోనే విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో తెలంగాణ స్వాంతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయజెండా ఎగురవేసి కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారు. సర్ధార్‌ వల్లాభాయి కారణంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని రేవంత్ అన్నారు. హిందు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

'ఆనాడు హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం ప్రసాదించింది కాంగ్రెస్‌ పార్టీ. నిజాం పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పోరాడింది. ఇవాళ కొందరు చరిత్రను వక్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. తెలంగాణ అంటేనే కాంగ్రెస్. కమ్యూనిస్టులతో కలిసి భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేశారు. చరిత్రను నేడు కొందరు వక్రీకరిస్తున్నారు. ఆనాడు 563 సంస్థానాలను భారత్‌లో విలీనం చేశారు. గుజరాత్‌లోని జునాఘడ్‌లో వేడుకలు ఎందుకు జరపట్లేదు. హిందు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారు. నెహ్రూ ఆదేశాల మేరకే పటేల్ హైదరాబాద్‌ను విలీనం చేశారు. స్వాతంత్ర్య, సాయుధ పోరాట సమయానికి భాజపా అసలు పుట్టలేదు.' రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది ఉద్యమకారుల వీరోచిత పోరాటమే ఈ స్వేచ్ఛ అని అన్నారు. అమరులు, వీరులను స్మరించుకుంటూ.. వారి గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బైరాన్​పల్లి ఘటనలు తెలంగాణలో చాలా జరిగాయని తెలిపారు. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం దండు కట్టిండ్రు.. దళంగా కదిలిండ్రు అని గుర్తుచేశారు. దేశం, రాష్ట్రానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చింది.. కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్లుగా సెప్టెంబర్ 17 ఉత్సవాలు చేయని తెరాస సర్కార్​కు ఇప్పుడే గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. 1950లో గాంధీ భవన్​కు సర్దార్ వల్లభాయ్ పటేల్ పునాదులు వేశారన్నారు. పటేల్​కు పూలదండ వేసే నైతిక హక్కు కూడా భాజపాకు లేదని అన్నారు.

"దేశంలో మోదీ సర్కార్ విస్తరించడానికి కుట్రలు చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని దోచిపెడుతుంది. విడగొట్టే పనిలో మీరున్నరు.. కలిపే పనిలో మేమున్నాం. వాట్స్ ఆఫ్ యూనివర్సిటీలో ఓవర్ నైట్ పని చేసి యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇక కేసీఆర్ స్వీయ చరిత్ర, కుటుంబ చరిత్ర రాసుకోవడానికి అసలు చరిత్రను వక్రీకరిస్తున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 'టీఎస్​'ను 'టీజీ'గా మారుస్తాం. అందెశ్రీ రాసిన పాటను రాష్ట్ర గీతంగా చేస్తాం. కొత్త జెండా రూపుద్దిద్దుకుంటుంది. దానికి యువత, కవులు కళాకారుల మేధావుల ఆలోచనలు పంపాలి. సబ్బండ వర్గాల ప్రజల తల్లిగా తెలంగాణ తల్లిని రూపొందిస్తున్నామని" రేవంత్​రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్​లో ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న తెలంగాణ తల్లి సబ్బండ వర్గాలకు చెందినది కాదని ఆరోపిస్తున్న ఆ పార్టీ.. నూతన విగ్రహాన్ని ఆవిష్కరించింది. చాకలి ఐలమ్మ వీరత్వం, మల్లు స్వరాజ్యం ధీరత్వం కలగలిపిన విధంగా.. రాష్ట్ర సంస్కృతికి నిలువుటద్దంగా రూపకల్పన చేసినట్లు రేవంత్​రెడ్డి వెల్లడించారు. ఈ విగ్రహాన్ని గాంధీ భవన్​లో ఏర్పాటు చేయడం లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ప్రదర్శనకు మాత్రమే అక్కడ ఉంచినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.