ETV Bharat / city

'ఈ నెల 24న తెలంగాణలోకి భారత జోడో యాత్ర ప్రవేశం' - రాహుల్​ గాంధీ భారత జోడో యాత్ర

Revanthreddy on bharath jodo yatra: కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ చేస్తున్న భారత జోడో యాత్రను తెలంగాణలో విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షడు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. భారత జోడో యాత్రను సమన్వయం చేసేందుకు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేతలు సమావేశమయ్యారు.

tpcc chief revanthreddy
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి
author img

By

Published : Oct 1, 2022, 4:57 PM IST

Revanthreddy on bharath jodo yatra: ఈ నెల 24వ తేదీన రాహుల్‌గాంధీ భారత జోడో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత జోడో యాత్రను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేస్తామని తెలిపారు. మణికొండలోని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ నివాసంలో రాహుల్‌ గాంధీ భారత జోడో యాత్ర సమన్వయం చేసుకునేందుకు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేతలు సమావేశమయ్యారు.

ఇందులో భాగంగా జోడో యాత్ర విజయవంతం కోసం సమన్వయ కమిటీని కూడా వేస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలలో పాదయాత్ర అద్భుతంగా జరుగుతుందని వివరించారు. తమిళనాడు, కేరళ కంటే ఇక్కడ గొప్పగా చేస్తామన్నారు. మహారాష్ట్రకి మా సంపూర్ణ సపోర్ట్ ఉంటుందని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్రలో ఉన్న నిరుద్యోగ, రైతాంగ, మహిళా సమస్యలపై రాహుల్ గాంధీ కి వివరిస్తామని రేవంత్​ పేర్కొన్నారు.

భారత జోడో యాత్ర రూట్‌ మ్యాప్‌ను పరిశీలించబోతున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒక చారిత్మకమైన యాత్ర అని భట్టి కొనియాడారు. భారతదేశ నిర్మాణం కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేప్పట్టారన్నారు. దేశం దోపిడికి గురి కాకుండా ఉండాలనుకునే వారందరూ యాత్రలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

భారత్ జోడో యాత్రకు అశేష ఆదరణ లభిస్తోందని మహారాష్ట్ర సీఎల్పీ నేత బాలా సాహెబ్‌ తోరాట్‌ స్పష్టం చేశారు. తెలంగాణలాగే మహారాష్ట్రలో జోడో యాత్ర రూట్‌ మ్యాప్‌ తయారు చేస్తామన్నారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.