ETV Bharat / city

Revanth Reddy: కాంగ్రెస్​ పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్​ - రేవంత్ రెడ్డి వార్తలు

Revanth Reddy: కాంగ్రెస్​కు ఐకమత్యమే మహాబలమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు భిన్నంగా ఎవరైనా పార్టీ ముఖ్యులపై, వివిధ హోదాలలో ఉన్న నాయకులపై బహిరంగంగా లేదా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Revanth Reddy
Revanth Reddy
author img

By

Published : Apr 17, 2022, 7:49 PM IST

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్​కు వ్యతిరేకంగా, పార్టీని దెబ్బ తీసేట్లు ఎవరైనా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్‌కు ఐకమత్యమే మహాబలమంటూ ట్వీట్‌ చేశారు. పార్టీ ముఖ్య నాయకులకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడినా... విమర్శలు చేసినా సామాజిక మాధ్యమాల ద్వారా విమర్శలు చేసినా... ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

  • కాంగ్రెస్ కు ఐకమత్యమే మహాబలం

    అందుకు భిన్నంగా ఎవరైనా పార్టీ ముఖ్యుల పైన…వివిధ హోదాలలో ఉన్న నాయకుల పైన, బహిరంగంగా లేదా సోషల్ మీడియా లో విమర్శలు చేస్తే పార్టీ నుండి శాశ్వత బహిష్కరణ,క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదు.@kcvenugopalmp @manickamtagore @UttamINC @janareddyk @BhattiCLP

    — Revanth Reddy (@revanth_anumula) April 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎవరైనా పార్టీ నియమనిబంధనలు ఉల్లంఘించినట్లయితే పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించడంతో పాటు క్రిమినల్‌ కేసులను కూడా ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ట్వీట్‌ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డికి రేవంత్ రెడ్డి ట్యాగ్‌ చేశారు.

తెలంగాణలో తెరాసతో కాంగ్రెస్‌ పార్టీకి పొత్తు ఉంటుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌ స్పష్టం చేశారు. అదంతా అవాస్తవమని... పూర్తిగా నిరాధారమని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. భాజపా, తెరాసలపై కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటంలో ఒక్క ఇంచు కూడా తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తెరాస వాళ్లే చేస్తున్నారని స్పష్టంగా తెలిసిపోతుందన్నారు. వచ్చే నెల 6వ తేదీన వరంగల్‌లో జరగనున్న బహిరంగ సభలో తమ పార్టీ బలం ఏంటో చూపిస్తామని వెల్లడించారు.

  • The rumours of Congress coalition with TRS are totally false.
    Congress won’t move back an inch from our commitment to save Telangana from TRS & BJP.

    Let this be crystal clear to those spreading rumours!

    Let’s prepare for 6 th May Warrangal rally 💪🏻@INCTelangana

    — Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) April 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి : రామకృష్ణగౌడ్‌ హత్య కేసుపై పోలీసుల దర్యాప్తు.. స్థలవివాదమా..? పరువు హత్యా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.