తెరాస ప్రభుత్వం ఒక వైపు చెరువులు, నాలాల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్తూ.. మరోవైపు అదే పార్టీకి చెందిన నాయకులు కబ్జాలు చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లోని మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో రెవెన్యు అధికారులతో కలిసి మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి పర్యటించారు.
సున్నం చెరువు బఫర్జోన్లో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ నిర్మాణాలన్నీ తెరాస ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లో జరుగుతున్నాయని ఆరోపించారు. కబ్జాదారులకు అండగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని.. సున్నం చెరువు వద్ద జరుగుతున్న అక్రమాలపై హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు రేవంత్రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: ఎక్కడెక్కడ ఎంత పంపిణీ చేశారనే వివరాలివ్వాలి: రేవంత్రెడ్డి