Revanth Reddy on Bharat Jodo Yatra: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి భాజపా, తెరాసలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే ప్రక్రియలను భాజపా చేపట్టిందని రేవంత్ మండిపడ్డారు. దీనిపై సెప్టెంబర్ 4న దిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాహుల్‌గాంధీ చేపట్టే భారత్ జోడో యాత్ర విషయంలో నెలకొన్న అనుమానాలను రేవంత్ నివృత్తి చేశారు. ప్రజలను అనేక విషయాల్లో భాజపా విభజిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
వాటికి వ్యతిరేకంగా.. దేశాన్ని ఏకం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర చేపట్టనుందని రేవంత్ తెలిపారు. యాత్రలో... రాహుల్ గాంధీ ప్రజలతో మమేకం అవుతారని పేర్కొన్నారు. భాజపా నేతలు చేస్తోన్న విభజన రాజకీయాలను తిప్పి కొట్టేందుకు, ప్రజలను సమాయత్తం చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను, మోదీ, కేసీఆర్ వల్ల జరిగిన నష్టాలను వివరించబోతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలను బహిష్కరించి... దేశాన్ని రక్షించాలని ప్రజలను కోరారు.
'రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే ప్రక్రియ భాజపా చేపట్టింది. సీబీఐ, ఈడీని ఉపయోగించుకుని ప్రభుత్వాలను కూల్చే కుట్ర. వచ్చే నెల 4న దిల్లీలో నిరసన కార్యక్రమం. భారత్ జోడో యాత్ర విషయంలో అనుమానాలు నివృత్తి చేశాం. దేశాన్ని ఏకం చేయడం కోసమే కాంగ్రెస్ యాత్ర. యాత్రలో రాహుల్ గాంధీ ప్రజలతో మమేకం అవుతారు. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలు, జరిగిన నష్టాలను వివరిస్తాం. భాజపా, తెరాసను బహిష్కరించి దేశాన్ని రక్షించాలి.'-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: