గుజరాత్ నుంచి బయలుదేరిన నలుగురు వ్యక్తులు దేశాన్ని ఆగం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోదీ, అమిత్‌షాలు అమ్మడానికి వస్తే... అదాని, అంబానీలు కొనడానికి ముందుకు వస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ... నిర్వహించిన భారత్ బంద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొని ప్రభుత్వాల వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.
రైతు ఉద్యమానికి తొలుత కేసీఆర్ మద్దతు ఇచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (pcc chief revanth reddy) పేర్కొన్నారు. గతంలో రైతు బంద్‌లో కేటీఆర్ కుడా పాల్గొన్నారని గుర్తు చేశారు. మోదీని కలిసిన తర్వాత కేసీఆర్ వైఖరి మారిపోయిందని ఆరోపించారు. మోదీ (pm modi) ఏంమాయ చేశారో గాని కేసీఆర్‌లో (kcr) మార్పు వచ్చిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బంద్‌లో పాల్గొనకుండా మోదీతో విందులో పాల్గొంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎవరి పక్షాన ఉన్నారో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని సూచించారు. అదానీ, అంబానీలకు సాగును మోదీ తాకట్టు పెడుతున్నారన్నారు. కేసీఆర్, మోదీ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారిందని వెల్లడించారు.
ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలే...
లక్షా 96 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ కమిషన్లే చెప్పాయని స్పష్టం చేశారు. రైతు శ్రేయస్సును గతంలో కాంగ్రెస్ కాపాడిందని... మోదీ సర్కారు (modi government) రైతును బానిసగా మార్చిందని తెలిపారు. సాగు చట్టాలతో రైతు భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు. సాగు చట్టాలు రైతులు, వినియోగదారులకు మరణశాసనాలేనని విరుచుకుపడ్డారు. రైతుల పక్షాన పోరాడాల్సిన కేసీఆర్.. మోదీ ఒడిలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ఇంట్లో, బంధువులకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మోదీని కలిసిన తర్వాత కేసీఆర్ వైఖరి మారిపోయింది. మోదీ ఏంమాయ చేశారో గాని కేసీఆర్‌లో మార్పు వచ్చింది. కేసీఆర్ బంద్‌లో పాల్గొనకుండా మోదీతో విందులో పాల్గొంటున్నారు. కేసీఆర్ ఎవరి పక్షాన ఉన్నారో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అదానీ, అంబానీలకు సాగును మోదీ తాకట్టు పెడుతున్నారు. కేసీఆర్, మోదీ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారింది. లక్షా 96 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ కమిషన్లే చెప్పాయి. మోదీ సర్కారు రైతును బానిసగా మార్చింది. కేసీఆర్ ఇంట్లో, బంధువులకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయి.
- రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఎందుకీ బంద్ అంటే...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు... హైదరాబాద్‌లో బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ లో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయి. కాంగ్రెస్ , వామపక్షాలు సహా ఇతర పార్టీలతో పాటు రైతు సంఘాలు బంద్‌కు (bharat band) మద్దతు తెలిపాయి. ఉప్పల్ బస్ డిపో వద్ద పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (revanth reddy) నిరసన చేపట్టారు. బస్ డిపో ఎదుట బైఠాయించారు. అక్కడే మోదీ, కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. సాగు చట్టాలు అమలైతే... రైతులు, పేద ప్రజలు తీవ్ర కష్టాలకు గురవుతారని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. అఖిల పక్షాల ఆందోళనతో... వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రేవంత్‌రెడ్డి సహా తమ్మినేని పోలీసులు అరెస్టు చేసి... స్టేషన్‌కు తరలించారు.