హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలపై పూర్తి బాధ్యత తీసుకుంటానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలపై సమాచారం తెచ్చుకుని విశ్లేషిస్తామని రేవంత్ వెల్లడించారు. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ భవితవ్యాన్ని నిర్ణయించలేవని ఉద్ఘాటించారు. నియోజకవర్గంలోని ప్రతీ ఇంటి తలుపు తట్టామన్న రేవంత్.. ప్రజలకు దగ్గరైనట్టు తెలిపారు. భవిష్యత్తులో ప్రజల సమస్యల పరిష్కారానికి కార్యకర్తలతో కలిసి పోరాడతామని రేవంత్ పేర్కొన్నారు.
ఓటమితో బలహీనపడం..
"హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటమికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా. ఈ ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగింది. కాంగ్రెస్ భవిష్యత్తును ఎన్నికల ఫలితాలు నిర్ధరించలేవు. బల్మూరి వెంకట్ భవిష్యత్తులో రాష్ట్ర నాయకుడవుతారు. హుజురాబాద్ ప్రజలకు వెంకట్ అందుబాటులో ఉంటారు. భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజా సమస్యలపై పోరాడుతాం. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటి తలుపూ తట్టింది. ప్రజలకు చేరువై కాంగ్రెస్ గళం వినిపించాం. గెలిస్తే ఉప్పొంగేది లేదు.. ఓడితే బలహీనమయ్యేది లేదు. ప్రజా సమస్యలను పరిష్కారానికి కార్యకర్తలతో మమేకం అవుతాం. రాబోయే రోజుల్లో ప్రజల తరఫున పోరాడే ఓపిక నాకుంది." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇదీ చూడండి: