ETV Bharat / city

కేటీఆర్​, కవిత ట్వీట్​లకు రేవంత్​ కౌంటర్.. ​ఏమన్నారంటే..? - మంత్రి కేటీఆర్ ట్విట్టర్​

Revantreddy Comments: రాష్ట్రంలో రాహుల్​ గాంధీ రెండు రోజుల పర్యటనపై తెరాస నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అదే క్రమంలో.. ట్విటర్​ వేదికగా మంత్రి కేటీఆర్​, ఎమ్మెల్సీ కవిత రాహుల్​పై పలు విమర్శలు చేశారు. వాటిపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి.. పలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తూ రీట్వీట్​ చేశారు.

Revant reddy counter to ktra and kavitha tweets on rahul telangana tour

author img

By

Published : May 6, 2022, 1:21 PM IST

Revantreddy Comments: రాష్ట్రంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనపై మంత్రి కేటీఆర్​, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఘాటుగా స్పందించారు. ట్విటర్​ వేదికగా స్పందించిన రేవంత్​.. ఇద్దరికీ పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ పాలనపై అధ్యయనం చేసేందుకు వస్తోన్న రాహుల్​ గాంధీకి స్వాగతం అంటూ ట్వీట్​ చేసిన మంత్రి కేటీఆర్​కు తనదైన శైలిలో కౌంటర్​ వేశారు. రుణమాఫీ, ఎరువుల ఉచిత హామీ ఎలా ఎగ్గొట్టాలో అధ్యయనం చేయాలా..? అని ప్రశ్నించారు. వరి, మిర్చి, పత్తి రైతులు ఎలా చస్తున్నారో చూడాలా..? అని అడిగారు. మోదీ ముందు మోకరిల్లి రైతులకు ఉరితాళ్లు ఎలా బిగించాలో తెలుసుకోవాలా..? అని రేవంత్​ నిలదీశారు. ఈ నిజాలనే మరింత గట్టిగా చెప్పేందుకే రాహుల్ వస్తున్నారని రేవంత్‌ రెడ్డి స్పష్టతనిచ్చారు.

  • మీ పాలన పై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్!
    రుణమాఫీ హామీ ఎలా ఎగగొట్టాలి?
    ఎరువుల ఫ్రీ హామీని ఎలా అటకెక్కించాలి? మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ రైతులకు ఉరితాళ్లు ఎలాబిగించాలి?
    వరి,మిర్చీ,పత్తి రైతులు ఎలా చస్తున్నారు?

    ఇవే కదా నిజాలు. ఆ నిజాలు మరింత గట్టిగా చెప్పాడానికే రాహుల్ వస్తున్నారు. https://t.co/dta7YoZNkY

    — Revanth Reddy (@revanth_anumula) May 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు పలు ప్రశ్నలతో ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్​కు స్పందిస్తూ.. ప్రతిగా రేవంత్​రెడ్డి కూడా సవాళ్లు లేవనెత్తారు. వాటితో పాటు.. "చూసుకుని మురవాలి... చెప్పుకుని ఏడవాలి" అంటూ చేసిన ట్వీట్​ను కవితకు ట్యాగ్​ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు తాము ఎక్కడ ఉన్నారంటూ.. రేవంత్​ ప్రశ్నలు సంధించారు.

"మీ తండ్రి మోదీ ముందు మోకరిల్లి తెలంగాణ నుంచి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ రాసి రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు..? వరి వేస్తే ఉరే అని మీ తండ్రి ప్రవచనాలు చెప్పి ఆయన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి పంట వేసినప్పుడు మీరేం చేస్తున్నారు...? ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిరప రైతులు పిట్టల్లా రాలిపోతుంటే ఎక్కడ ఉన్నారు...? రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని మీ తండ్రి పచ్చి మోసానికి ఒడిగడితే ప్రశ్నించాల్సిన మీరెక్కడ ఉన్నారు..? రాష్ట్రంలో రైతులకు అవసరమైన 26 లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా ఇస్తామని మీ తండ్రి చెప్పి ఐదేళ్లవుతున్నా.. అర క్వింటాల్‌ ఎరువులు కూడా ఇవ్వలేదు.. అప్పుడు మీరెక్కడ ఉన్నారు...? అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం రాశులు తడిచి రైతులు బోరున విలపిస్తున్నారు... వారి కష్టం పట్టించుకోకుండా మీరెక్కడ ఉన్నారు..?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో భాజపాతో కలిసి డ్రామాలాడి ఆలస్యం చేయడం వల్ల చాలా మంది రైతులు ఇప్పటికే మద్దతు ధర కంటే చాలా తక్కువగా 1400 రూపాయలలోపే అమ్ముంటున్నారని రేవంత్​ ఆక్షేపించారు. గడిచిన ఎనిమిదేళ్లుగా తెరాస పంచన చేరి... తెలంగాణను వంచన చేశారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హక్కుగా రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం లాంటివి ఏ ఒక్కటీ తెరాస సాధించలేదని రేవంత్​ దుయ్యబట్టారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.