కృష్ణా జలాల వినియోగంపై నివేదికకు రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీని బోర్డు నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు, ఇద్దరు జెన్‌కో ప్రతినిధులతో పాటు.. కేఆర్ఎంబీల నుంచి చెరో ఇద్దరు అధికారులను బోర్డు నియమించింది. శ్రీశైలం, సాగర్ పవర్‌హౌస్ నిర్వహణపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని బోర్డు ఆదేశించింది.
కేంద్ర జలసంఘం నిబంధనల అమలుపై నెలలోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి బోర్డు సూచించింది. అదనపు జలాల పంపకానికి డిమార్కేషన్‌పై నెలలోగా నివేదిక ఇవ్వాలంది. కమిటీ త్వరగా నివేదిక ఇస్తే పరిశీలించి ఆమోదిస్తామని కేఆర్ఎంబీ తెలిపింది.
ఇవీ చూడండి: