ETV Bharat / city

సమాన అవకాశాలతోనే సమతూకం సాధ్యం: కేటీఆర్ - ministers ktr on ews reservations

మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్​ రావును వివిధ సామాజికవర్గాల ప్రతినిధులు కలిశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులను సన్మానించారు. సమసమాజ సాధనలో భాగంగానే ఆర్థికంగా వెనకబడిన తరగతులకు పదిశాతం రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు.

Representatives of various social groups met ministers ktr and errabelli dayaker rao

author img

By

Published : Jan 22, 2021, 3:30 PM IST

సమాజంలో అందరికీ అన్ని అవకాశాలుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. సమసమాజ సాధనలో భాగంగానే ఆర్థికంగా వెనకబడిన తరగతులకు పదిశాతం రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్​ రావును కలిసిన వివిధ సామాజికవర్గాల ప్రతినిధులు... ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులను సన్మానించారు.

ప్రస్తుత రిజర్వేషన్లు యథాతథంగానే ఉంటాయని... అదనపు రిజర్వేషన్లతో అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. స‌మాన అవ‌కాశాలు క‌ల్పిస్తేనే స‌మాజంలో స‌మతూకం ఉంటుంద‌ని చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మనసున్న మానవీయ ప్రభుత్వమన్న కేటీఆర్... 'నా తెలంగాణ కోటి ర‌త‌నాల వీణ' అంటూ కీర్తించిన క‌వుల మాట‌ల‌ను నిజం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం అభినందనీయమన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... అగ్రకులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి ఎంతో ఊరట కలుగుతుందని వివరించారు.

ఇదీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన నీతిఆయోగ్ బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.