YCP MLA Pinnelli: వైకాపా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి కోసం మున్సిపల్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. మాచర్ల మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న కౌన్సిలర్లు పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకుంటే.. తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు సమావేశమవుతున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లికి మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణలో పిన్నెల్లికి అవకాశం ఉంటుందా లేదా అనే ఆందోళనతో రాజీనామాలకు సిద్ధమయ్యారు. మరో వైపు ఎమ్మెల్యే పిన్నెల్లి మాచర్ల చేరుకుంటున్నారు.
ప్రచారంలో ఉన్న ప్రకారం పాత మంత్రుల్లో కొనసాగే వారి పేర్లు..!: గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, నారాయణస్వామి, తానేటి వనిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకర నారాయణ, కొడాలి నాని, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలలో అయిదారుగురికి లేదా ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఇంకో ఒకరిద్దరికీ కొత్త మంత్రివర్గంలో అవకాశం ఉండొచ్చంటున్నారు.
ఇదీ చూడండి: 'ఈ నెల 11 నుంచి ఏపీలో కొత్త కేబినెట్'