పాఠశాల విద్యాశాఖ(Telangana Education Ministry)లో కొత్తగా 5,323 పోస్టులను భర్తీ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వాటిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలకు 937 పోస్టు గ్రాడ్యుయేట్ రెసిడెన్షియల్ టీచర్ల పోస్టులు, ఆదర్శ పాఠశాలలకు 397 ఒకేషనల్ ట్రైనర్లు, ఒకేషనల్ కో-ఆర్డినేటర్లు, 1,435 ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలలకు 2,343 ఇన్‌స్ట్రక్టర్లు, ప్రభుత్వ ఎంఈడీ కళాశాలలకు 211 బోధనా సిబ్బంది పోస్టులను తాజాగా మంజూరు చేసింది.