ETV Bharat / city

స్కూల్ ఫీజుల నియంత్రణపై మళ్లీ కసరత్తు

author img

By

Published : Feb 26, 2021, 7:01 AM IST

ఫీజుల నియంత్రణపై రాష్ట్ర విద్యాశాఖ మరోసారి కసరత్తు ప్రారంభించింది. వచ్చే విద్యాసంవత్సరానికి ఈ వ్యవహారానికి సంబంధించి ముగింపు పలకాలని భావిస్తోంది.

Regulation of fees in Telangana educational institutes
బడి ఫీజుల నియంత్రణపై మళ్లీ కసరత్తు

ప్రైవేట్‌ పాఠశాలల ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచకుండా నియంత్రించాలన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ మళ్లీ కసరత్తు ప్రారంభించింది. వచ్చే విద్యాసంవత్సరం(2021-22) ప్రారంభం నాటికి రుసుముల వ్యవహారానికి ఒక శాస్త్రీయ ముగింపు పలకాలని అధికారులు భావిస్తున్నారు. గత కొద్దిరోజుల్లోనే రెండుసార్లు సమావేశమై చర్చించిన అధికారులు మళ్లీ ఈ నెల 27, మార్చి 1న భేటీ అయి భిన్న కోణాల్లో చర్చించనున్నారు.

2017 డిసెంబరులో ఓయూ మాజీ ఉపకులపతి ఆచార్య తిరుపతిరావు ఛైర్మన్‌గా నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ఆ కమిటీ నివేదిక సమర్పించినా దానిపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ‘అసలు 10 శాతం పెంచడం పక్కనబెడితే.. ఇప్పుడున్న ఫీజులను ఎలా నిర్ణయించారు? అందుకు ప్రాతిపదిక ఏమిటి? అన్నది తొలుత ఖరారు చేయాల్సి ఉంది’ అని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి ఫీజులు పెంచరాదని, 2019-20 విద్యా సంవత్సరంలో వసూలు చేసినంత మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం 2020 ఏప్రిల్‌లో జీఓ 46 జారీ చేసింది. విద్యాశాఖ వద్ద 2019-20లో ఏ పాఠశాల ఫీజు ఎంతన్న వివరాలు మాత్రం లేకపోవడం గమనార్హం.

కమిటీ ప్రధాన సిఫారసులు

2016-17 విద్యాసంవత్సరంలో పాఠశాలలు వసూలు చేసిన రుసుములపై 10 శాతం వరకు ఏటా పెంచుకోవచ్చు. అంతకంటే పెంచాలంటే అప్పిలేట్‌ కమిటీ అనుమతి పొందటం తప్పనిసరి.

జోనల్‌ స్థాయిలో జోనల్‌ రుసుముల నియంత్రణ కమిటీ(జడ్‌ఎఫ్‌ఆర్‌సీ)ని నియమిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు జోన్లు ఉండగా.. వాటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రవేశాలను కూడా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలి. డొనేషన్లు, అడ్మిషన్ల ఫీజు వసూలు చేయడానికి వీల్లేదు.

గతంలో జారీ చేసిన జీఓ 91 ప్రకారం వేతనాలు, ఇతర ప్రయోజనాలకు, నిర్వహణ వ్యయాలకు ఎంతెంత ఖర్చు చేయాలో శాతాలను పేర్కొన్నారు. ఇక ఈ శాతాలు ఉండవు. ఉపాధ్యాయుల వేతనాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.