ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్‌ల ద్వారా 9,287 యూనిట్ల రక్త నిల్వలు సేకరించినట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఛైర్మన్ డాక్టర్ ఎ.శ్రీధర్ రెడ్డి తెలిపారు. సేకరించిన రక్త నిల్వలు లక్ష మందికి ఉపయోగపడతాయన్నారు.
కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రక్తనిల్వలు పడిపోయాయని శ్రీధర్ పేర్కొన్నారు. బ్లడ్ క్యాంప్ ద్వారా రక్తం సేకరించటంతో రక్త నిల్వలు పెరిగాయని తెలిపారు. రక్త కొరత ఉన్న తమిళనాడు, బెంగళూరు, తెలంగాణ రాష్ట్రాలకు సైతం సరఫరా చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రైనా.. కేంద్రమంత్రైనా.. కిషన్ రెడ్డే: సోయం