ETV Bharat / city

GURUKULS : గురుకులాల్లో నిలిచిన పోస్టుల భర్తీ

తెలంగాణ గురుకులాల్లో(GURUKULS) పోస్టుల భర్తీ ప్రక్రియలో అడుగు ముందుకు పడటం లేదు. దాదాపు 1200కు పైగా పోస్టులపై ఎటువంటి కదలిక లేదు. మూడేళ్లుగా నియామకాలు లేకపోవడం వల్ల పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది.

recruitment stopped-in telangana gurukuls
గురుకులాల్లో నిలిచిన పోస్టుల భర్తీ, తెలంగాణ గురుకులాలు
author img

By

Published : Jul 5, 2021, 7:05 AM IST

రాష్ట్రంలో పేదలకు కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా ఏర్పాటు చేసిన గురుకులా(GURUKULS)ల్లో పోస్టుల భర్తీ నిలిచిపోయింది. గతంలోనే మంజూరు చేసిన దాదాపు ఏడు వేలకు పైగా పోస్టుల్లో ఒక్క నియామకం జరగలేదు. ఓ వైపు భారీ సంఖ్యలో కొత్త గురుకులాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ప్రత్యేకంగా గురుకుల నియామక బోర్డును ఏర్పాటు చేసినా భర్తీ ప్రక్రియలో అడుగులు ముందుకు పడటం లేదు.

నూతన జోనల్‌ విధానం మేరకు సర్వీసు నిబంధనలు, పోస్టుల వర్గీకరణకు ప్రభుత్వ ఆమోదం లభించిందని గతంలోనే ప్రకటించిన సొసైటీలు ఎస్సీ, ఎస్టీ గురుకుల కళాశాలల్లో ప్రిన్సిపల్‌ పోస్టులు మినహా టీజీటీ, పీజీటీ, లెక్చరర్‌ ఇతర పోస్టులకు ప్రకటన జారీ చేయలేదు. నూతన జోనల్‌ విధానానికి ముందుగానే బోర్డు పరిధిలో మంజూరైన భాషా పండితులు, పీఈటీలు, ఇతర కేటగిరీలకు చెందిన మరో 1200కు పైగా పోస్టులపై కదలిక లేకుండా పోయింది. మూడేళ్లుగా దాదాపు నియామకాలేవీ లేకపోవడంతో రెండేళ్లలో పాఠశాలల నుంచి జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ అయిన 323 బీసీ, మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది.

బీసీ సొసైటీలోనే 5,387 పోస్టులు

మైనార్టీ, బీసీ సొసైటీల పరిధిలో భారీ సంఖ్యలో గురుకులా(GURUKULS)లొచ్చాయి. ఇవన్నీ పాఠశాల నుంచి జూనియర్‌ కళాశాలలకు అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి. 2020-21, 2021-22 ఏడాదికి మైనార్టీ సొసైటీ పరిధిలోని 204 గురుకుల పాఠశాలలు జూనియర్‌ కళాశాలలుగా మారాయి. వీటిల్లో 24వేల మంది చదువుతున్నారు. బీసీ సొసైటీ పరిధిలో ఈ విద్యాసంవత్సరానికి 119 పాఠశాలలు జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ అయ్యాయి. వచ్చే ఏడాదికి మరో 119 పాఠశాలలు కళాశాలలుగా మారనున్నాయి. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినపుడే భవిష్యత్తు అవసరాల దృష్టితో ప్రభుత్వం పోస్టులు మంజూరు చేసింది. ఒక్క బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే వివిధ కేటగిరీల్లో 5,387 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి మూడేళ్ల క్రితమే ఆర్థికశాఖ గురుకుల బోర్డుకు అనుమతిచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ సంక్షేమ సొసైటీల్లో ప్రస్తుతం ఏర్పడిన ఖాళీలను కలిపితే దాదాపు 8వేల వరకు ఉంటాయని అంచనా.

సర్వీసు నిబంధనలకు ఆమోదం లభించినా..

గురుకులాల(GURUKULS) పరిధిలో ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు జోనల్‌ పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు గురుకుల సొసైటీ సర్వీసు నిబంధనలు రూపొందించింది. జోన్లు, మల్టీజోన్లు, జిల్లాల వారీగా పోస్టులను వర్గీకరించింది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను ఆయా గురుకుల బోర్డు ఛైర్మన్లు (సంక్షేమశాఖల మంత్రులు) ఆమోదించారు. బోర్డు ఛైర్మన్లు ఆమోదించిన వెంటనే అన్ని గురుకులాల్లో పోస్టులను భర్తీ చేస్తామని బోర్డు వర్గాలు వెల్లడించాయి. కానీ ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో మాత్రమే పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ చేసి దరఖాస్తులు స్వీకరించారు. మిగతా పోస్టుల విషయాన్ని పట్టించుకోలేదు. రెండేళ్లుగా జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ అయిన గురుకులా(GURUKULS)ల్లో దాదాపు 40వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆయా విద్యార్థుల బోధనకు పీజీటీలను సర్దుబాటు చేస్తూ ఒప్పంద సిబ్బందిని వినియోగించుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం నిర్ణయించిన నియామక షెడ్యూలు ప్రకారం విద్యాసంవత్సరానికి ఆయా పోస్టుల భర్తీ పూర్తికావాల్సి ఉన్నా ఆ మేరకు జరగలేదు. వచ్చే ఏడాదికి బీసీ సొసైటీలో మరో 119 గురుకుల జూనియర్‌ కళాశాలలు రానుండటంతో సిబ్బంది కొరత మరింత తీవ్రం కానుంది.

మంజూరైన పోస్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.