ETV Bharat / city

బుసలు కొడుతున్న కరోనా.. నిబంధనలను గాలికొదిలేసిన ప్రజలు

author img

By

Published : Apr 11, 2021, 3:40 PM IST

రాష్ట్రంలో రెండో దశ కరోనా బుసలు కొడుతోంది. క్రమంగా వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వాల చర్యలతో వైరస్‌ కట్టడి కనిపించకపోగా... అటు ప్రజల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా కేసుల పెరుగుదలతో పాటు.... మరణాల సంఖ్యా ఆందోళన కలిగిస్తోంది.

corona impact in telangana
తెలంగాణలో రెండో దశ కరోనా విజృంభణ

రాష్ట్రవ్యాప్తంగా రెండోదశలో మహమ్మారి విరుచుకుపడుతోంది. లక్షణాలు పైకి కనిపించకపోయినా... చాపకింద నీరులా అందరికి సోకుతోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలకుండా కమ్మేస్తోంది. గడచిన రెండు రోజులుగా అధికారిక లెక్కల ప్రకారమే 3వేలకు తగ్గకుండా కేసులు.... ఐదుకు మించి మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా లక్షా 15 వేల 311 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.... అందులో 3,187 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. గతేడాది రాష్ట్రంలో కరోనా ప్రారంభమైన నాటి నుంచి నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వారిలో మరో 3,753 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. గత ఏడాది మార్చి 2న కొవిడ్‌ వెలుగు చూసిన నాటి నుంచి.... నిత్యం 3 వేల లోపు కేసులే నమోదు కాగా... ఆగస్టు 25న మాత్రం అత్యధికంగా 3వేల 18 మందికి వైరస్ సోకింది. తాజాగా ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో 3,187 మంది కొవిడ్​ బారిన పడ్డారు.

తగ్గిన మరణాల రేటు..

మరోవైపు కరోనా క్రియాశీలక కేసుల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతోంది. మొదటి దశలో గరిష్ఠంగా 25,685 యాక్టివ్ కేసులకు చేరగా... రెండో దశలో ఇప్పటికే 20,184 యాక్టివ్‌ కేసులున్నాయి. గతంలో గరిష్ఠంగా 6,578 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందగా... ఇప్పుడు 6,818 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ గణాంకాల ప్రకారం గతంతో పోల్చితే.. ఆస్పత్రుల్లో చేరుతున్న కొవిడ్​ బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. మొదటి దశతో పోల్చితే కొవిడ్​ మరణాల సంఖ్య కొంతమేరకు తగ్గుదల కనిపిస్తోంది. గత ఆగస్టులో మరణాల రేటు 0.69 శాతం ఉండగా.. ప్రస్తుతం 0.53 శాతం ఉంది.

అప్పట్లో ఇలా..

గతేడాది మార్చి 2న రాష్ట్రంలో తొలిసారి కరోనా కేసు వెలుగుచూడగా... తక్షణమే కట్టడి చర్యలకు సర్కార్‌ నడుం బిగించింది. మార్చి 23 నుంచి లాక్​డౌన్ విధించడం సహా.. ఎక్కడిక్కడ నిర్ధారణ పరీక్షలు, కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. పూర్తి స్థాయిలో కరోనా నిబంధనలు అమలుచేసింది.

ఇది ప్రస్తుతం..

గతేడాది ఆగస్టు 25న రికార్డు స్థాయి కేసుల అనంతరం.. క్రమంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఫలితంగా కొన్ని నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఈ జనవరిలో విద్యాసంస్థలనూ తెరిచింది. ఆంక్షల సడలింపు, ప్రజల్లో వైరస్‌ పట్ల తొలగిన భయాందోళనల ఫలితంగా మహమ్మారి మరో మారు విజృంభిస్తోంది. పెద్దఎత్తున విద్యార్థులూ కరోనా బారిన పడ్డారు. అప్రమత్తమైన సర్కారు.. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసింది.

10 నుంచి 20 ఏళ్ల మధ్యవారిలో..

అప్పటితో పోలిస్తే సున్నా నుంచి 10 ఏళ్లలోపు ఉన్నవారిలో వైరస్ బారిన పడుతున్న వారు ఒక శాతం వరకు తగ్గగా... పది నుంచి 20 ఏళ్ల మధ్య వారిలో మాత్రం కేసులు భారీగా పెరిగాయి. అప్పట్లో కేవలం 10-20 ఏళ్ల మధ్య వారు 6.5 శాతం మంది ఉండగా... ఇప్పుడది 10.5 శాతానికి పెరిగింది. 50 ఏళ్లు పైబడిన వారిలోనూ కరోనా కేసులు స్వలంగా పెరిగాయి.

ఇవే కారణాలు!

గతంతో పోల్చితే కరోనా కట్టడికి ప్రత్యేకంగా కంటైన్మెంట్ చర్యలు పెద్దగా చేపట్టని సర్కారు... లాక్​డౌన్​, కర్ఫ్యూ ఉండే అవకాశం లేదని స్పష్టం చేసింది. మరోవైపు పొరుగు రాష్ట్రాలతో వ్యాపార, సామాజిక సంబంధాలు, ప్రజల్లో వైరస్‌ పట్ల ధీమా వెరసీ మహమ్మారి రెండో సారి పంజా విసిరేందుకు ద్వారాలు తెరిచింది.

ఇవీచూడండి: 'పరిస్థితి తీవ్రం.. ఇళ్లలోంచి బయటకు రావొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.