ETV Bharat / city

ఆర్‌బీఐలో 841 ఆఫీస్ అటెండెంట్లు.. చివరితేదీ మార్చి 15 - ఆఫీస్​ అటెండెంట్​ పోస్టులకు ఆర్బీఐ దరఖాస్తుల ఆహ్వానం

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) దేశ‌వ్యాప్తంగా ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్​లైన్​ దరఖాస్తుకు మార్చి 15 చివరితేదీగా నిర్ణయించారు.

rbi notification for office attendants in all over india
ఆర్‌బీఐలో 841 ఆఫీస్ అటెండెంట్లు.. చివరితేదీ మార్చి 15
author img

By

Published : Feb 24, 2021, 8:04 PM IST

రిజర్వ్ బ్యాంకు ఆఫ్​ ఇండియా దేశవ్యాప్తంగా ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 841 కాగా.. హైదరాబాద్​లో 57 పోస్టులు ఉన్నాయి.

* ఆఫీస్ అటెండెంట్లు

* మొత్తం ఖాళీలు: 841

* హైద‌రాబాద్ - 57

అర్హ‌త‌:

ప‌దో త‌ర‌గ‌తి (ఎస్ఎస్‌సీ/ మెట్రిక్యులేష‌న్) ఉత్తీర్ణ‌త‌. 01.02.2021 నాటికి అండర్ గ్రాడ్యుయేట్‌గా ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్న‌త విద్యార్హ‌త‌లు ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అన‌ర్హులు.

వ‌య‌సు:

01.02.2021 నాటికి 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 02.02.1996 - 01.02.2003 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వయ‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

ఆన్‌లైన్ టెస్ట్‌, లాంగ్వేజ్ ప్రొఫిషియ‌న్సీ టెస్ట్‌(ఎల్‌పీటీ) ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. కింద సూచించిన విధంగా వివిధ విభాగాల నుంచి ప్ర‌శ్న‌లు ఉంటాయి.

1.రీజ‌నింగ్ 30 ప్ర‌శ్న‌లు 30 మార్కులు

2. జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ 30 ప్ర‌శ్న‌లు 30 మార్కులు

3. జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ 30 ప్ర‌శ్న‌లు 30 మార్కులు

4. న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ 30 ప్ర‌శ్న‌లు 30 మార్కులు

* ప‌రీక్షా స‌మ‌యం 90 నిమిషాలు ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్ ఇంగ్లిష్, హిందీ మాధ్య‌మాల్లో నిర్వ‌హిస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 1/4 మార్కు తీసేస్తారు. ఎల్‌పీటీ అర్హ‌త ప‌రీక్ష‌గా మాత్ర‌మే నిర్వ‌హిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్‌లో ఎంపికైన అభ్య‌ర్థుల‌కు లాంగ్వేజ్ ప్రొఫిషియ‌న్సీ టెస్ట్ ఉంటుంది. దీన్ని సంబంధిత రాష్ట్రానికి చెందిన భాష‌లో నిర్వ‌హిస్తారు. ఎల్‌పీటీలో అర్హ‌త సాధించని అభ్య‌ర్థులను ఎంపిక ప్రక్రియ‌కు తీసుకోరు.

ద‌ర‌ఖాస్తు విధానం:

ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. మరే ఇతర ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తులు అంగీక‌రించ‌బ‌డ‌వు.

ద‌ర‌ఖాస్తు ఫీజు:

ఓబీసీ/ ఈడ‌బ్ల్యూఎస్‌/ జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు రూ.450, ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థులు రూ.50 చెల్లించాలి.

ముఖ్య‌మైన తేదీలు:

1. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 24.02.2021.

2.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.03.2021.

3.ప‌రీక్ష తేది: 2021 ఏప్రిల్ 9, 10.

ఇదీ చూడండి : యూనివర్సిటీ భూముల్లో రోడ్డు ఎలా నిర్మిస్తారు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.