ETV Bharat / city

రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను తప్పుబట్టిన కేంద్రం - రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేంద్రం పైర్ వార్తలు

Rayalaseema lift irregation Scheme DPR erroneous center
రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను తప్పుబట్టిన కేంద్రం
author img

By

Published : Dec 17, 2020, 6:04 PM IST

Updated : Dec 17, 2020, 7:56 PM IST

18:03 December 17

రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను తప్పుబట్టిన కేంద్రం

రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌పై కేంద్ర జలశక్తిశాఖ అసంతృప్తి వ్యక్తంచేసింది. డీపీఆర్‌లో కనీస ప్రాథమిక అంశాలు లేవని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సంచాలకులు ముఖర్జీ.... ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు లేఖ రాశారు.

ప్రాథమిక అంశాలూ లేవు..

మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను నవంబర్ 16న ఎలక్ట్రానిక్ విధానంలో, డిసెంబరు 3న ప్రతుల రూపంలో.... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించింది. డీపీఆర్ ప్రతులను పరిశీలించిన కేంద్ర జలశక్తిశాఖ... 46 పేజీల డాక్యుమెంట్‌లో కనీస ప్రాథమిక అంశాలైన.. హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర అంశాలు, ఇరిగేషన్ ప్లానింగ్, డిజైన్, కాస్ట్‌ఎస్టిమేట్ లేవని పేర్కొంది.

టెక్నో-ఎకనమిక్ ఫిజబీలిటీ నిర్ధారణ కోసం డీపీఆర్‌ను ప్రిలిమినరీ అప్రైజల్ కూడా చేసే పరిస్థితి లేదని కేంద్రం పేర్కొంది. నీటిపారుదల, బహుళార్ధక ప్రాజెక్టుల డీపీఆర్‌ల తయారీ మార్గదర్శకాలు..కేంద్ర జలసంఘం వెబ్ సైట్‌లో ఉన్నాయని.. వాటికి అనుగుణంగా సరైన డీపీఆర్‌ను రూపొందించి పంపాలని జల్‌శక్తి శాఖ కోరింది

ఇవీచూడండి: ప్రజల సమాచారం ప్రభుత్వం సేకరిస్తే అంగీకరించం: హైకోర్టు​

Last Updated : Dec 17, 2020, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.