ETV Bharat / city

Rare heart surgery: హార్ట్‌ ఫెయిల్‌.. అరుదైన చికిత్సతో ప్రాణం పోసిన ఏఐజీ వైద్యులు - ఏఐజీ వైద్యుల ఘనత

Rare heart surgery: అసాధారణ స్థాయిలో గుండె కొట్టుకుంటున్న వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స చేసి.. విజయం సాధించారు హైదరాబాద్​లోని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు. యువకుడికి గుండె కింది భాగంలోని గదులు వేగంగా కొట్టుకుంటున్నట్టు నిర్ధరించారు. సాధారణంగా ఇలాంటి శస్త్రచికిత్సలు అత్యంత క్లిష్టమైనవి కాగా.. అప్పటికే యువకుడి గుండెలో ఆర్టిఫిషియల్ పంప్ ఉన్నందున శస్త్రచికిత్స మరింత ఇబ్బందికరంగా మారినట్లు వైద్యులు పేర్కొన్నారు.

హార్ట్‌ ఫెయిల్‌.. ఏఐజీ వైద్యుల అరుదైన చికిత్స

author img

By

Published : Apr 7, 2022, 4:40 PM IST

Rare heart surgery: అసాధారణ స్థాయిలో గుండె కొట్టుకుంటున్న వ్యక్తికి.. హైదరాబాద్​లోని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి విజయం సాధించారు. 34 ఏళ్ల ఓ వ్యక్తికి గతంలో హార్ట్ ఫెయిల్ కావటంతో.. వైద్యులు కృత్రిమ హార్ట్‌పంప్‌ని అమర్చారు. ఇటీవల గుండె కొట్టుకునే వేగం పెరగడం వల్ల.. యువకుడు ఏఐజీ ఆసుపత్రి వైద్యులను సంప్రదించాడు. యువకుడిని పరీక్షించిన వైద్యులు.. అతడికి వెంట్రిక్యులార్ టాకీకార్డియా అనే వ్యాధి ఉందని గుర్తించారు. దీనివల్ల గుండె కింది భాగంలోని గదులు వేగంగా కొట్టుకుంటున్నట్టు నిర్ధరించారు.

వ్యాధి నియంత్రణ కోసం మందులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో.. రక్తనాళాల ద్వారా గుండె లోపలికి ఎలక్ట్రో క్యాథటర్స్‌ని పంపి.. సమస్య కారణాలను విశ్లేషించారు. అనంతరం త్రీ డీ మ్యాపింగ్ పద్ధతిలో ఆ ప్రాంతంలో రేయిడో ఫ్రీక్వెన్సి ఎనర్జీని పంపటం ద్వారా వేగాన్ని నియంత్రించారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఈ తరహా శస్త్రచికిత్స చేసినట్టు ఏఐజీ వైద్యులు ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి శస్త్రచికిత్సలు అత్యంత క్లిష్టమైనవి కాగా.. అప్పటికే యువకుడి గుండెలో ఆర్టిఫిషియల్ పంప్ ఉన్నందున శస్త్రచికిత్స మరింత ఇబ్బందికరంగా మారినట్లు వైద్యులు వివరించారు.

హార్ట్‌ ఫెయిల్‌.. ఏఐజీ వైద్యుల అరుదైన చికిత్స

ఇదీ చదవండి: ఒక మహిళను గౌరవించే విధానం ఇదేనా..? : గవర్నర్ తమిళిసై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.