ETV Bharat / city

జూబ్లీహిల్స్​ గ్యాంగ్​రేప్​... సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ - మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

Jubilee Hills Gang Rape Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌లో బాలిక అత్యాచార ఘటనను... రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఘటనపై వివరణ ఇవ్వాలని డీజీపీని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు.

Jubilee Hills Gang Rape Case
Jubilee Hills Gang Rape Case
author img

By

Published : Jun 6, 2022, 1:24 PM IST

Jubilee Hills Gang Rape Case: జూబ్లీహిల్స్​ మైనర్​ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన రాష్ట్రంలో సంచనలంగా మారింది. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటపడుతూ.. కేసు ఆసక్తికరంగా మారుతోంది. ఇందులో ప్రజాప్రతినిధుల కుమారులుండటం.. వాళ్లు కూడా మైనర్లే కావటంతో.. ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార ఘటనను... రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఘటనపై వివరణ ఇవ్వాలని డీజీపీని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్న ఆమె.. బాధితురాలికి మహిళా కమిషన్, ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టంచేశారు.

అసలేం జరిగిందంటే.. Gang Rape on Girl:ఒక ఇంటర్నేషనల్‌ పాఠశాల పేరుతో మద్యం రహిత వేడుకకు అనుమతి తీసుకున్న ప్లస్‌ వన్‌, ప్లస్‌ టూ విద్యార్థులు, వారి స్నేహితులు పబ్‌కు వచ్చారు. 152 మందికి అనుమతి ఉండగా 182 మంది హాజరైనట్లు సమాచారం. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5.30 వరకు వారు అక్కడే ఉన్నారు. బల్దియాలోని ఓ కార్పొరేటర్‌ కుమారుడు (16) బాధిత బాలికతో మాట కలిపాడు. గతంలో ఒకసారి కలిశామంటూ కథలు చెప్పి నమ్మించాడు. తన స్నేహితులను పరిచయం చేశాడు. వేడుక ముగిశాక బాలికతో కలిసి వారంతా బెంజి, ఇన్నోవా కార్లలో బయలుదేరారు. ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు ఉమేర్‌ఖాన్‌ బెంజి కారు నడుపుతుండగా ఎమ్మెల్యే కుమారుడు, కార్పొరేటర్‌ కుమారుడు, ఇతర స్నేహితులు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. వారు ఆమెకు ముద్దులు పెట్టడం, దగ్గరికి తీసుకొనే దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా బయటికొచ్చాయి. ఆమెను బంజారాహిల్స్‌ రోడ్డు నం.14లోని కాన్సు బేకరీకి తీసుకెళ్లి ఇన్నోవాలోకి ఎక్కించుకున్నాక నిందితులు సుమారు 50 నిమిషాల పాటు బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ మార్గాల్లో చక్కర్లు కొడుతూ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

తర్వాత బాలికను పబ్‌ వద్ద వదిలేసిన నిందితులు అదే బేకరీ వద్ద ఫొటోలు దిగారు. పార్టీ ముగిసిందంటూ తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. కార్పొరేటర్‌ కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు, ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ తనయుడు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పబ్‌ నుంచి బేకరీకి వెళ్లే సమయంలో బెంజి కారును నడిపింది ఉమేర్‌ఖాన్‌గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కార్పొరేటర్‌ కుమారుడు, ఎమ్మెల్యే తనయుడు, ఉమేర్‌ఖాన్‌ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాదుద్దీన్‌ మాలిక్‌ (18)తో పాటు మరో ఇద్దరు బాలురను అరెస్టు చేసిన పోలీసులు శనివారం రాత్రి గుల్బర్గా ప్రాంతంలో మరో బాలుడిని అరెస్టు చేశారు. కీలక నిందితుడు ఉమేర్‌ఖాన్‌ (18)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వదంతులు వస్తున్నా, అతడు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ పిటిషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.