ETV Bharat / city

చెత్త నుంచి కోట్ల విలువైన కరెంటు.. ప్రారంభానికి ముందే రికార్డు - Ranky Plant in Hyderabad

వ్యర్థాలతో విద్యుత్తు ఉత్పత్తిలో బల్దియా రికార్డు సాధించింది. అధికారికంగా ప్రారంభానికి ముందే 1.5కోట్ల యూనిట్లను ఉత్పత్తి చేసింది. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంటును 100శాతం పట్టాలెక్కించి వారం రోజుల్లో అధికారికంగా ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది.

Crores worth of electricity from garbage
చెత్త నుంచి కోట్ల విలువైన కరెంటు
author img

By

Published : Nov 5, 2020, 8:18 AM IST

ఆగస్టు 20న జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంటు ప్రయోగాత్మక పరీక్ష మొదలైంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వకపోవడంతో బల్దియా అధికారులు రెండింటిలో ఒక బాయిలర్‌(50శాతం)నే మండిస్తున్నారు. రోజుకు 800 టన్నుల చెత్తను భస్మం చేస్తూ.. గరిష్ఠంగా 2 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రక్రియ విజయవంతంగా నడుస్తుండటంతో ప్లాంటును 100శాతం పట్టాలెక్కించి వారం రోజుల్లో అధికారికంగా ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది.

ప్లాంటు 100శాతం నడిస్తే..

విద్యుదుత్పత్తి కేంద్రం పూర్తి స్థాయిలో నడిస్తే రోజుకు 1,600టన్నుల చెత్త బూడిదవుతుంది. అంటే నగరంలో ఉత్పత్తయ్యే 27శాతం వ్యర్థాలకు పరిష్కారం దొరికిననట్టే. 1000డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత వద్ద చెత్త బూడిదగా మారుతుంది. దాన్ని మళ్లీ ఇటుకలు, ఇతరత్రా వస్తు తయారీలో ఉపయోగిస్తామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన 4,600టన్నుల చెత్తలో కొంత భాగాన్ని ఎరువుగా మార్చి ఎందుకూ పనికిరానివాటిని మాత్రమే వ్యర్థాలుగా పోస్తామంటున్నారు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం రాంకీ ప్లాంటులో ఉత్పత్తవుతున్న విద్యుత్తును యూనిట్‌కు రూ. 7.80 చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏడాదికి 174 మిలియన్‌ యూనిట్ల కరెంటును ఉత్పత్తి చేయాలనేది డంపింగ్‌ యార్డు నిర్వహణ సంస్థ రాంకీ లక్ష్యం.

మారుతున్న నిర్వహణ తీరు

నగర వ్యాప్తంగా ఉత్పత్తయ్యే చెత్త మొదట స్థానికంగా ఉన్న 17 తరలింపు కేంద్రాలకు చేరుతుంది. ప్రస్తుతం ఆయా కేంద్రాలు దుర్వాసనకు చిరునామాగా ఉన్నాయి. వాటిని బల్దియా ఆధునికీకరిస్తోంది. ఇప్పటి వరకు ఏడింటిని ఆధునికీకరించినట్లు పారిశుద్ధ్య విభాగం అదనపు కమిషనర్‌ రాహుల్‌రాజ్‌ పేర్కొన్నారు. క్రమంగా అన్నింటినీ పరిశుభ్రంగా మారుస్తామని, సీసీ కెమెరాలు, పచ్చదనం, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. తరలింపు కేంద్రాల్లో చెత్తను తడి, పొడిగా వేరు చేయడాన్ని తప్పనిసరి చేసి డంపింగ్‌ యార్డుకు వెళ్లే వ్యర్థాల పరిమాణాన్ని తగ్గిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఒక రోజులో..

జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజూ ఉత్పత్తయ్యే చెత్త 6,000

టన్నులు విద్యుదుత్పత్తి కేంద్రం సామర్థ్యం 19.8 మెగావాట్లు

ప్రస్తుతం నడస్తున్న బాయిలర్‌ సామర్థ్యం 9.88 మెగావాట్లు

అందులో బూడిద అవుతున్న చెత్త 800 టన్నులు

ఇప్పటి వరకు బూడిదైన వ్యర్థాలు 60వేల టన్నులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.