భాగ్యనగరంలో సంక్రాంతి పండగ శోభ మెుదలైంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో... హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో రంగవల్లికల పోటీలు ఏర్పాటు చేశారు. వయో భేదం లేకుండా మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొని వేసిన రకరకాల ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయి.
కేవలం బతుకమ్మ, బోనాలు పండుగలే కాకుండా రాష్ట్రంలో సంక్రాంతి పండుగను కూడా వైభవంగా జరుపుకుంటామని... మన సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి తెలిపేందుకు ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి తెలిపారు.