ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా శాసనమండలిలో పోరాటం చేస్తానని రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి గౌరి సతీశ్ అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
పోట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. ఈ రంగాల్లో వెనుకబడితే అభివృద్ధి, ఆరోగ్య తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులు ఓటు వేసేముందు ఒకసారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఓటు వేసి గెలిపిస్తే అందరి గొంతుకనై వినిపిస్తానని స్పష్టం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కరోనా కారణం చూపి గాలికి వదిలేసిందన్నారు.
ఇదీ చూడండి: గ్రేటర్ హైదరాబాద్ నేతలతో కేటీఆర్ భేటీ... ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ