ETV Bharat / city

'ది వైర్‌' వెబ్‌సైట్‌కు ఇన్‌జంక్షన్‌ ఆర్డర్స్​.. ఎందుకంటే..? - 100 CRORE defamation case filed by BHARAT BIOTECH

ది వైర్‌ వెబ్‌సైట్‌ మీద భారత్‌ బయోటెక్‌ దాఖలు చేసిన పిటిషన్​పై.. రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా జడ్జి విచారణ చేపట్టారు. భారత్‌ బయోటెక్, కొవాగ్జిన్‌ టీకాపై ప్రచురించిన 14 కథనాలను... నోటీసులు అందిన 48 గంటల్లో తొలగించాలని ఆదేశించారు. ఈ మేరకు న్యాయస్థానం ఇన్‌జంక్షన్‌ ఉత్తర్వులు జారీచేసింది.

Rangareddy District Court orders injunction against The Wire website

author img

By

Published : Feb 24, 2022, 4:49 AM IST

'ది వైర్‌' వెబ్‌సైట్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు ఇన్‌జంక్షన్‌ ఉత్తర్వులు జారీచేసింది. భారత్‌ బయోటెక్, కొవాగ్జిన్‌ టీకాపై ప్రచురించిన 14 కథనాలను... నోటీసులు అందిన 48 గంటల్లో తొలగించాలని ఆదేశించింది. భవిష్యత్తులోనూ భారత్‌ బయోటెక్‌ కంపెనీ, డైరెక్టర్లు, ఉద్యోగులు, ఏజెంట్లు, ఉత్పత్తుల పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి కథనాలు ప్రచురించరాదని.. మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

తమ కంపెనీతోపాటు తాము ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్‌పై.. ఎలాంటి ఆధారాలు లేకుండా ది వైర్‌ వెబ్‌సైట్‌ రాసిన కథనాలను తొలగించేలా ఆదేశించాలని భారత్‌ బయోటెక్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా జడ్జి విచారణ చేపట్టారు. ది వైర్‌ వెబ్‌సైట్‌.. దురుద్దేశాలతో కంపెనీ ఉత్పత్తులపై కథనాలు రాసిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ప్రభుత్వం... ఈ కంపెనీకే అనుమతి ఇచ్చిందని తెలిపారు. వైర్‌ రాసిన రాతల కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వేయించడానికి వెనుకంజవేసే ప్రమాదం ఉందని న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ వాదనలు విన్న కోర్టు ఆయా కథనాలను తొలగించాలని, భవిష్యత్తులో రాయకూడదని...మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు అందజేయాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.