డిజిటల్ మాధ్యమంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ ఈటీవీ విన్ మొబైల్ యాప్‌ను... ఈనాడు టెలివిజన్ ప్రారంభించింది. ఎక్కడ ఉన్నా ఏసమయంలోనైనా ప్రేక్షకులను వినోదాల ప్రపంచంలో విహరింపచేసే ఈటీవీ విన్ యాప్‌ను... రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆవిష్కరించారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యాప్ డౌన్‌లోడ్ లింక్: ఈటీవీ విన్
ఈటీవీ నెట్‌వర్క్‌లోని ఏడు ఛానళ్లకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఈ యాప్‌లో చూడవచ్చు. తెలుగువారంతా అభిమానించే ఈటీవీ సీరియళ్లు అన్నీ ఇందులోనూ చూడవచ్చు. ఎంతో ప్రజాదరణ పొందిన జబర్దస్త్, ఢీ, అలీతో సరదాగా వంటి షోలు, పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి మధుర సంగీత కార్యక్రమాలను ఇందులో చూడవచ్చు. ఇంటిల్లిపాదినీ అలరించే ఈటీవీ ఈవెంట్స్, వార్తలు, వంటలు, వంటకాలు, ఆరోగ్య చిట్కాలు ఇంకా ఎన్నో అంశాలను ఈటీవీ విన్ మొబైల్ ఫోన్‌లోనే అందిస్తుంది. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఆనాటి, ఈనాటి మేటి చలనచిత్రాలు కూడా ఈటీవీ విన్ లో అందుబాటులో ఉంటాయి.
రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన యాప్ ప్రారంభోత్సవంలో ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్.కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్లు ఎ.రామమోహన్‌రావు, సి.హెచ్.విజయేశ్వరి, ప్రియా ఫుడ్స్ డైరెక్టర్ సహరి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, గ్రూప్ ఆడిటర్ జి.సాంబశివరావు, కంపెనీ సెక్రటరీ జి.శ్రీనివాస్, ఈటీవీ సీఈవో కె.బాపినీడు, గ్రూప్ హెచ్ఆర్ ప్రెసిడెంట్ ఎ.గోపాలరావు, ఈటీవీ చీఫ్ ప్రొడ్యూసర్ అజయ్‌శాంతి, నెట్‌వర్క్ చీఫ్ ప్రొడ్యూసర్ పి.కె.మాన్వి, చీఫ్ ఇంజినీర్ ప్రసాదరావు, ఈటీవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
యాప్ డౌన్‌లోడ్ లింక్: ఈటీవీ విన్