ETV Bharat / city

ప్రగతిభవన్​లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు - CM KCR in Raksha Bandhan Celebrations

Raksha Bandhan Celebrations in Pragathi Bhavan ప్రగతిభవన్​లో రక్షాబంధన్ వేడుకలు కోలాహలంగా జరిగాయి. పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్​కు తన సోదరీమణులు రాఖీలు కట్టారు. సీఎం కేసీఆర్ కుమారుడు, కుమార్తెలయిన కేటీఆర్, కవితతో పాటు​ మనువడు మనువరాలు కూడా రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు.

Raksha Bandhan Celebrations in Pragathi Bhavan

author img

By

Published : Aug 12, 2022, 4:59 PM IST

Raksha Bandhan Celebrations in Pragathi Bhavan: ప్రగతిభవన్​లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీపండుగ సందర్భంగా ఆప్యాయతలు, సహోదర భావాలు వెల్లివిరిసాయి. సోదరీమణుల రాకతో సీఎం కేసీఆర్​ నివాసం సందడి నెలకొంది. ఇంటికి వచ్చిన తమ ఆడబిడ్డలను సీఎం కేసీఆర్ గారి సతీమణి శోభ సాదరంగా, సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు. కేసీఆర్​ సోదరీమణులు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, వినోదమ్మ.. ఆయనకు రాఖీలు కట్టారు. అనంతరం సోదరీమణులకు కేసీఆర్ పాదాభివందనం చేయగా.. తమ సోదరున్ని నిండు మనసుతో ఆశీర్వదించారు.

అదే సందర్భంలో.. సీఎం కేసీఆర్ మనువడు మనువరాలు రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తన అన్న హిమాన్షుకు సోదరి అలేఖ్య రాఖీ కట్టింది. ఈ సందర్భంగా.. తాతయ్య నానమ్మలైన కేసీఆర్​, శోభమ్మ దంపతుల ఆశీర్వాదం తీసుకోగా.. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనువడు, మనువరాలిని దీవించారు. వేడుకల్లో పాల్గొన్న ఇతర పెద్దలు కూడా వాళ్లకు ఆశీర్వాదాలిచ్చారు. అంతకు ముందు.. ఐటీశాఖ మంత్రి కేటీఆర్​కు తన సోదరి ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రగతిభవన్​లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.