Raksha Bandhan Celebrations: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని.. తమ సోదరుడికి సోదరిమణులు రాఖీ కట్టారు. అనంతరం వారి ఆశీర్వాదం తీసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి పుట్టింటికి ఆడపడుచులు రావటంతో ఇళ్లలో సందడి వాతావరణం నెలకొంది. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖుల ఇళ్లల్లోనూ.. రాఖీ పండుగ సంబురాలు ఘనంగా జరిగాయి.
ప్రగతి భవన్‌లో రాఖీ పండుగ వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు తన సోదరి ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టి... శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇంట్లో రాఖీ సంబురాలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటికి చేరుకున్నారు. మంత్రి హరీశ్ రావుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బాన్సువాడలోని ఆయన నివాసంలో సత్యవతి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆమె పోచారం ఆశీర్వాదాలు తీసుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి.. తన సోదరుడు నరసింహారెడ్డి ఇంటికెళ్లి రాఖీ కట్టారు. పెద్దపల్లిలో తెరాస శ్రేణులు.. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి సంబురాలు జరుపుకున్నారు.
ఇవీ చూడండి: