ఏపీ తూర్పు గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని.. ఎంపీ మార్గాని భరత్‌రామ్ పేర్కొన్నారు. 'తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తెరాస విధానాలు నచ్చలేదంటూ పౌరుషంతో తన పదవికి రాజీనామా చేశారు. రఘురామకృష్ణరాజు అదే రీతిలో ఎంపీ పదవికి రాజీనామా చేయాలి' అని భరత్‌రామ్ డిమాండ్ చేశారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు ఖరీఫ్ సాగునీటి విడుదలను గోదావరి డెల్టా సీఈ పుల్లారావుతో కలిసి ప్రారంభించారు. ఉభయగోదావరి జిల్లాల పరిధిలో సుమారు 10.13 లక్షల ఎకరాలకు 120 టీఎంసీల నీరు అవసరమవుతుందన్నారు. తొలిరోజు మూడు డెల్టాలకు మూడు వేల క్యూసెక్కుల నీటిని అందించారు.
ఇదీ చదవండి: పెళ్లామే కావాలన్న పదహారేళ్ల బాలుడు