రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో రైతుల గొంతుకను వినిపించేందుకు రైతు స్వరాజ్య వేదిక ఏర్పడింది. దశాబ్ద కాలంలో ఎన్నో విషయాల్లో విజయం సాధించారు. ఈ సంఘంలో కేవలం రైతులే కాకుండా మేధావులు, నిపుణులు, ఆర్థిక వేత్తలు, రైతు కార్యకర్తలు ఉన్నారు. 30 మందితో ప్రారంభమైన ఈ సంఘంలో ఇప్పుడు 30వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. సంక్షోభంలో ఉన్న రైతు కుటుంబాలకు భరోసా ఇవ్వడం, ఏజెన్సీ రైతులకు సహయసహకారాలు ఇస్తోంది.
రైతుల హక్కుల కోసం కృషి
కౌలు రైతుల హక్కుల కోసం కృషి చేస్తూ వారికి గుర్తింపు కార్డులు ఇప్పించటంలో కీలకపాత్ర పోషించింది. అటవీ భూముల హక్కుల విషయంలోనూ కృషి చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి చేయూతను అందిస్తోంది. దీనివల్ల ఆయా కుటుంబాల్లోని మహిళ రైతులు పంటలు పండిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
అన్నదాతలకు శిక్షణ
రైతు సంక్షేమం, రైతులకు శిక్షణ విషయంలోనూ ఈ సంఘం కృషి చేస్తోంది. ఖర్చు తగ్గించుకుని, పర్యావరణ హితంగా స్థానిక వనరులతో ఎలా వ్యవసాయం చేసుకోవాలనే దానిపై శిక్షణనిస్తోంది. సహజ వ్యవసాయం చేసే వారిని కో-ఆపరేటివ్ సొసైటీగా ఏర్పరచి లాభదాయకంగా ఏర్పాటు చేయటంపై కృషి చేస్తోంది. గ్రామీణ కార్యకర్తలకు బీమా, మద్దతు ధర, రుణాలు విషయంలో అవగాహన కల్పిస్తోంది.
ఇదీ చదవండి: రక్షణరంగంలో తనదైన గుర్తింపు సాధించిన తెలుగు వనిత