ETV Bharat / city

రాష్ట్రంలో లక్షా 68వేల వాననీటి సంరక్షణ నిర్మాణాలు!

గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని పట్టణాల్లో లక్షా 68వేల వాననీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర సర్కార్ లక్ష్యం నిర్దేశించుకుంది. జలశక్తి అభియాన్​లో భాగంగా సెప్టెంబర్ నెలాఖరు వరకు ఈ లక్ష్యాలు పూర్తి చేయాలని పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం వార్డుల వారిగా కౌన్సిలర్లు, కార్పొరేటర్ల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

author img

By

Published : Apr 24, 2021, 12:11 PM IST

rain water harvesting , rain water harvesting pits, rain water harvesting  in telangana
వాననీటి సంరక్షణ, వాననీటి సంరక్షణ నిర్మాణాలు, తెలంగాణలో వాననీటి సంరక్షణ

జలశక్తి మిషన్ అర్బన్​లో భాగంగా వాననీటి సంరక్షణ, భూగర్భ జలవనరుల పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు వాననీటి సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వాననీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టేందుకు పురపాలకశాఖ సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగతా 141 పట్టణ ప్రాంతాలకు ఇందుకు సంబంధించి లక్ష్యాలను నిర్ధేశించింది.

సెప్టెంబర్​ టార్గెట్

141 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో 24 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నాయి. ఆయా పట్టణాల్లోని నివాసగృహ సముదాయాలు, ప్రజాప్రతినిధుల నివాసాలు, ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, కళాశాలలు, ట్యాంకులు, ఫిల్టర్ బెడ్లు, చేతిపంపులు తదితరాల ఆధారంగా లక్ష్యాలను ఖరారు చేశారు. మొత్తంగా లక్షా 68వేలా 86 వాననీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.

వరదల నివారణ

విద్యా, వాణిజ్య సంస్థలు, ఆసుపత్రులు... తదితర ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల్లో వాననీటి సంరక్షణ నిర్మాణాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని, ఒకవేళ ఇప్పటికే ఉంటే వర్షాకాలంలో అవి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ స్పష్టం చేసింది. నివాస గృహ సొసైటీల్లో ఈ నిర్మాణాలు చేపడితే పట్టణ ప్రాంతాల్లో వరదలను నివారించవచ్చని, ఆ దిశగా కార్యాచరణ అమలు చేయాలని తెలిపింది. చెట్ల చుట్టూ కాంక్రీట్​తో పేవ్ మెంట్ వేయకుండా పేవర్ బ్లాక్స్ వేయడం ద్వారా నీరు కిందకు ఇంకే అవకాశం ఉంటుందని పేర్కొంది.

ఇవి ఉంటేనే అనుమతులు

2016 మోడల్ బిల్డింగ్ బై లాస్ ప్రకారం వాననీటి సంరక్షణ నిర్మాణాలు ఉంటేనే భవన నిర్మాణ అనుమతులు ఇస్తామని పురపాలక శాఖ స్పష్టం చేసింది. ఆక్యుపెన్సీ ధ్రువపత్రాన్ని కూడా వాననీటి సంరక్షణ నిర్మాణాన్ని తనిఖీ చేశాకే ఇస్తామని తెలిపింది. లక్ష్యాన్ని చేరుకునే కార్యాచరణలో భాగంగా స్థానిక కార్పొరేటర్ లేదా కౌన్సిలర్ ఆధ్వర్యంలో అధికారులు, ఇంజినీర్లు, పారిశుద్ధ్య కార్మికులతో బృందాలను ఏర్పాటు చేయాలని... స్వయం సహాయక సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, ఎన్జీఓలు, ఇతరుల్లో అవగాహన కల్పించాలని సూచించింది.

వాననీటిని ఒడిసిపట్టాలి

నిర్మాణానికి అనుకూలమైన స్థలాలు గుర్తించి వాటికి అంచనాలు తయారు చేయడం సహా అనుమతులు, టెండర్ ప్రక్రియను చేపట్టాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించింది. గృహ నిర్మాణ సముదాయాలు, వ్యక్తిగత భవనాల్లో సొంతంగా నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆయా పట్టణాల్లోని ప్రజాప్రతినిధులు తమ ఇండ్లలో మొదట వాననీటి సంరక్షణ నిర్మాణాలు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా గడువులోగా లక్ష్యాలను పూర్తి చేసి వర్షాకాలంలో వాననీటిని ఒడిసిపట్టాలని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.