ETV Bharat / city

చల్లబడిన భానుడు... చిరుజల్లులతో వరుణుడు

Rain in many areas of Hyderabad
Rain in many areas of Hyderabad
author img

By

Published : Apr 12, 2021, 2:52 PM IST

Updated : Apr 12, 2021, 3:37 PM IST

14:51 April 12

నగరంలో పలుచోట్ల వర్షం... ఆహ్లాదకరంగా వాతావరణం

చల్లబడిన భానుడు... చిరుజల్లులతో వరుణుడు

రోజూ భగభగ మండే భానుడు కాసింత బ్రేక్​ తీసుకున్నాడు. ఎండలతో హీటెక్కిపోతున్న హైదరాబాద్​పై వరుణుడు చల్లని కరుణ చూపించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిపించి జనాలకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించాడు.  

సికింద్రాబాద్​, బేగంపేట, ప్యారడైజ్​, సంగీత్​, ష్టేషన్​, చిలకలగూడా, బోయిన్​పల్లి, అల్వాల్​ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎస్సార్​నగర్, సనత్​నగర్ ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురిశాయి. మల్లాపూర్, నాచారం, ఈసీఐఎల్, కాప్రా, ఎస్వీనగర్ ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. కుషాయిగూడ, దమ్మాయిగూడా, నాగారం, చర్లపల్లి, జవహార్ నగర్​లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

మరోవైపు... సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మిట్ట మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురు గాలులతో కూడిన వాన పడింది.

ఒక్కసారిగా కురిసిన చిరుజల్లులతో... వాతావరణం చల్లబడి ఆహ్లాద వాతావరణం నెలకొంది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతోన్న నగరవాసులు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు.  

ఇదీ చూడండి: రాగల 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...!

Last Updated : Apr 12, 2021, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.