ఉదయం నుంచి మండుటెండతో ఇబ్బంది పడ్డ నగర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కోఠి, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, సోమాజీగూడ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం పడింది.
ఈ ప్రాంతాలతో పాటు కూకట్‌పల్లి, హైదర్‌నగర్, బాలాజీనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, బోయిన్‌పల్లి, అల్వాల్, తిరుమలగిరి, ప్రగతినగర్, నిజాంపేట్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్‌లో చిరుజల్లులు కురిశాయి. వాహనదారులు కాస్త ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: 'అద్దెలు పెరిగింది హైదరాబాద్‌లో మాత్రమే!'