ఉపరితల ఆవర్తనం కారణంగా రాజధానిలో చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సికింద్రాబాద్, బేగంపేట, ప్యారడైజ్, ప్యాట్నీ, చిలకలగూడ, బోయిన్‌పల్లి, ఆల్వాల్, తిరుమలగిరి, మారేడ్‌పల్లి, మేడ్చల్‌లో జోరు వాన పడింది. జీడిమెట్ల, కొంపల్లి, సూరారం, సుచిత్ర, షాపూర్‌నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఉప్పుగూడలో ఓ మోస్తరు వర్షం పడింది. బహదూర్‌పురా, జూపార్కు, పురానాపూల్, దూద్‌బౌలి, లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్ పరిసరాల్లో భారీ వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇవీ చూడండి: భారత అంకురాల్లో 12 రెట్లు పెరిగిన చైనా పెట్టుబడులు