రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం హైదరాబాద్ వాసులకు ముప్పుతిప్పులు పెడుతోంది. అప్పటిదాక ప్రశాతంగా ఉన్న వాతవరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఈదురు గాలులు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మధ్యాహ్నం ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హయత్‌నగర్, తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, చార్మినార్, బహదూర్‌పురా, యాఖుత్‌పురా, చాంద్రాయణగుట్టలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. భీకర గాలులకు చాలా ప్రాంతాల్లో హోర్డింగులు, చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు నేల మట్టమయ్యాయి. చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించి వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇవీ చూడండి: జూన్‌లోనే చెరువులకు కాళేశ్వరం నీళ్లు