ETV Bharat / state

'నేను ఇప్పుడు విచారణకు రాలేను' : పోలీసులకు రామ్​గోపాల్ వర్మ వాట్సప్ మెసెజ్​ - RGV INVESTIGATION UPDATES

పోలీసుల విచారణకు గైర్హాజరైన సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ - తనకు సమయం కావాలంటూ వాట్సప్​లో మెసెజ్

RAM GOPAL VARMA INVESTIGATION
RGV Seeking Time For Investigation in Social Media Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2024, 12:38 PM IST

RGV Seeking Time For Investigation in Social Media Case : సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. అప్పటి టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు, లోకేశ్​, జనసేన అధినేత పవన్​ కల్యాణ్​లను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో వర్మ పోస్టులు పెట్టారంటూ ఆయనపై ఏపీలోని మద్దిపాడు పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, రాంగోపాల్​ వర్మను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో నేడు ఒంగోలు గ్రామీణ సీఐ కార్యాలయంలో ఆర్జీవీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన గైర్హాజరయ్యారు. ఈ విషయంపై మద్దిపాడు పోలీసులకు వర్మ వాట్సప్​ మెసేజ్​ చేశారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు 4 రోజుల సమయం కావాలని అందులో కోరినట్లు సమాచారం.

వారం రోజుల క్రితం (నవంబర్​ 13న) ఎస్సై శివ రామయ్య ఆధ్వర్యంలోని పోలీసుల బృందం హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో రామ్‌ గోపాల్‌వర్మ ​ఇంటికి వెళ్లి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న ఆర్జీవీ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసులు కొట్టి వేయాలని కోరారు. నవంబర్​ 19న విచారణకు హాజరు కావాలంటూ మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారని వర్మ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణకు హాజరయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.

గడువు పొడిగింపు కోసం అభ్యర్థన : ఈ సందర్భంగా వర్మ తరఫు న్యాయవాది అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. కేసు విషయంలో అరెస్ట్​పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. విచారణకు గడువు పొడిగింపు కోసం పోలీసుల ముందు అభ్యర్థన చేసుకోవాలని, కోర్టులో కాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు 4 రోజుల సమయం కావాలని రామ్‌గోపాల్‌ వర్మ ​మద్దిపాడు పోలీసులకు వాట్సాప్‌ మెసెజ్ చేసినట్లు సమాచారం. మరోవైపు తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు సైతం వర్మపై ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఆ పోస్టులు పెట్టినందుకు రాంగోపాల్ వర్మకు నోటీసులు - విచారణకు హాజరు కావాలన్న పోలీసులు

రామ్​గోపాల్​ వర్మపై వరుసగా కేసులు నమోదు - కొంపముంచిన సోషల్ మీడియాలో పోస్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.