ETV Bharat / city

రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

Telangana Rain Alert రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఈ నెల 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటం వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

rain alert
వర్ష సూచన
author img

By

Published : Aug 17, 2022, 4:14 PM IST

Telangana Rain Alert: భారీ వర్షాలతో ముంచెత్తిన వరుణుడు కాస్త విరామం​ తీసుకుని.. భానుడు ఎంట్రీ ఇవ్వటంతో రాష్ట్ర ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. అయినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల గోదావరికి పెద్దఎత్తున వరద వస్తుండటంతో.. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలను మళ్లీ వరుణుడు పలకరించే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు. రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నెల 19వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమ వైపు ఆవరించి ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి బలహీనపడిందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని సంచాలకులు వివరించారు. నేడు కిందిస్థాయి గాలులు నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపుకు వీస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వర్షాలు పడే అవకాశం ఉండటం వల్ల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.