హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో కొత్తగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జ్‌లో నాణ్యత లోపించింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వంతెన పైకప్పు, గోడల నుంచి నీరు కారుతున్నాయి. ప్రారంభించి రెండు నెలలు కూడా కాకముందే నీరుకారడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
![rob, railway under bridge, railway under bridge repair](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12186731_paa-2.jpg)
బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్న వాహనదారులు, పాదచారులపై నీళ్లు పడుతుండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
![rob, railway under bridge, railway under bridge repair](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12186731_paa-1.jpg)
ఇదీ చదవండి : పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?