దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మే 3 వరకు అన్ని ప్రయాణికుల రైళ్లతో పాటు ప్రీమియం, మెయిల్, ఎక్స్‌ప్రెస్, సబర్బన్ రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి తేదీలు ప్రకటించే వరకు ముందస్తు రిజర్వేషన్లు ఉండబోవని స్పష్టంచేసింది.
రద్దైన రైళ్లకు సంబంధించిన టికెట్ ఛార్జీలను 100 శాతం వెనక్కి ఇస్తామని తెలిపింది. ఈ-టికెట్ రీఫండ్ దానంతట అదే వినియోగదారుల ఖాతాలో జమచేయడం జరుగుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఇవీచూడండి: విదేశాల్లోని భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు!