పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణ రావు మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ ఒక గొప్ప కార్యదక్షత కలిగిన నాయకుడిని కోల్పోయిందని అన్నారు. ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని రాహుల్ స్పష్టం చేశారు.
ఎన్నో దశాబ్దాల పాటు ప్రజల కోసం రాజకీయాలు చేసిన గొప్ప నాయకుడు ఎంఎస్ఆర్ అని రాహుల్ గాంధీ కొనియాడారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబం ధైర్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సత్యనారాయణ రావు భార్య సుగుణకు లేఖ పంపారు.