ETV Bharat / city

మహిళా సాధికారతపై లఘుచిత్రం.. పోస్టర్​ రిలీజ్​ చేసిన రాచకొండ సీపీ

మహిళా సాధికారతపై రూపొందించిన లఘు చిత్రం “అమ్మాయి’ పోస్టర్​ను రాచకొండ పోలీస్​ కమిషనర్​ మహేష్​ భగవత్​ ఆయన కార్యాలయంలో విడుదల చేశారు. యూనిట్​ సభ్యుల నడుమ పోస్టర్​ విడుదలైంది. అనుకోకుండా ఎదురైన సంఘటనలను మహిళలు ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని ఈ లఘుచిత్రంలో చూపించినట్టు తెలిపారు.

Rachakonda Cp Released short film poster
మహిళా సాధికారతపై లఘుచిత్రం.. పోస్టర్​ రిలీజ్​ చేసిన రాచకొండ సీపీ
author img

By

Published : Oct 23, 2020, 12:16 AM IST

మహిళా సాధికారతపై రూపొందించిన కొత్త లఘుచిత్రం ‘అమ్మాయి’ పోస్టర్​ను రాచకొండ సీపీ మహేష్​ భగవత్​ యూనిట్​ సభ్యులతో కలిసి విడుదల చేశారు. శశాంక్​ దర్శకత్వం వహించిన ఈ లఘుచిత్రం విజయం సాధించాలని సీపీ ఆకాంక్షించారు.

మహిళలకు ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు, దాడులు, లైంగిక వేధింపులను ఎలా ఎదుర్కోవాలి... ఎలా స్పందించాలి... తదితర అంశాలను ఈ లఘుచిత్రంలో చూపించినట్టు తెలిపారు. తమను తాము రక్షించుకోడానికి మహిళలు ఎలా ఉండాలనదే ఈ చిత్రం ముఖ్య ఉద్దేశమని దర్శకుడు శశాంక్​ తెలిపారు. పాఠశాలల్లోని బాలికల కోసం రాచకొండ పోలీసులు విద్యార్థి పోలీసు కాడెట్ పేరుతో.. ఆత్మరక్షణ కళ నిర్వహిస్తున్నారు. ప్రతి స్త్రీ తనను తాను రక్షించుకునే ఆయుధంగా మారాలని సీపీ సూచించారు.

ఇదీ చూడండి: వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో కేంద్రబృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.